Women Cricket : మహిళా క్రికెటర్లకు కాసుల వర్షం.. బీసీసీఐ మైండ్ బ్లోయింగ్ నిర్ణయం
Women Cricket : ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2025లో భారత మహిళా జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
Women Cricket : మహిళా క్రికెటర్లకు కాసుల వర్షం.. బీసీసీఐ మైండ్ బ్లోయింగ్ నిర్ణయం
Women Cricket : ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2025లో భారత మహిళా జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. తొలిసారి ట్రోఫీని ముద్దాడి దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ అద్భుత విజయానికి గుర్తింపుగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళా క్రికెటర్లకు కళ్లు చెదిరే బహుమతిని ప్రకటించింది. కేవలం అంతర్జాతీయ స్థాయిలో ఆడేవారికే కాకుండా దేశవాళీ క్రికెటర్ల జీవితాల్లో వెలుగులు నింపేలా మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇన్నాళ్లూ పురుష, మహిళా క్రికెటర్ల మధ్య ఉన్న ఆదాయ వ్యత్యాసాన్ని బీసీసీఐ పూర్తిగా చెరిపేసింది. సమాన పనికి సమాన వేతనం అనే నినాదాన్ని నిజం చేస్తూ, దేశవాళీ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా పెంచింది. దీనివల్ల స్టేట్ లెవల్ ఆడే ఎందరో యువ క్రీడాకారిణులకు ఆర్థికంగా పెద్ద ఊతం లభించనుంది. ఇకపై మహిళా క్రికెటర్లు కూడా పురుషులతో సమానంగా ఫీజులు అందుకోబోతున్నారు.
సీనియర్ మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే, వన్డే, మల్టీ-డే (ఎక్కువ రోజులు ఆడే) మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవన్ లో ఉన్న వారికి ప్రతిరోజూ 50,000 రూపాయలు లభించనున్నాయి. గతంలో ఇది కేవలం 20,000 రూపాయలుగా మాత్రమే ఉండేది. ఇక రిజర్వ్ బెంచ్ మీద ఉండే ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కి 25,000 రూపాయలు అందుతాయి. టీ20 మ్యాచ్‌ల విషయానికి వస్తే, ఆడే ప్లేయర్లకు 25,000, రిజర్వ్ ప్లేయర్లకు 12,500 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు.
కేవలం సీనియర్లకే కాకుండా, అండర్-19 వంటి జూనియర్ టోర్నమెంట్లలో ఆడే అమ్మాయిలకు కూడా బీసీసీఐ మేలు చేకూర్చింది. వన్డే/మల్టీ-డే మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవన్‌కు రోజుకు 25,000, రిజర్వ్ ప్లేయర్లకు 12,500 రూపాయలు ఇస్తారు. టీ20ల్లో అయితే ఆడేవారికి 12,500, బెంచ్ ప్లేయర్లకు 6,250 రూపాయలు అందుతాయి. ఈ పెంపు వల్ల చిన్నప్పటి నుంచే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆటగాళ్లతో పాటు మ్యాచ్ నిర్వహణలో కీలక పాత్ర పోషించే అంపైర్లు, మ్యాచ్ రెఫరీలకు కూడా జీతాలు పెరిగాయి. దేశవాళీ లీగ్ మ్యాచ్‌లలో అంపైరింగ్ చేసే వారికి రోజుకు 40,000, నాకౌట్ మ్యాచ్‌లలో 50,000 నుంచి 60,000 రూపాయల వరకు చెల్లిస్తారు. అంటే ఒక రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేస్తే దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో క్రికెట్ అనుబంధ రంగాల్లో ఉన్నవారికి కూడా మంచి ఆర్థిక భరోసా లభించింది.