BCCI: 'బీసీసీఐ సర్వసభ్య సమావేశం వాయిదా'

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వాయిదా ప‌డింది. ఈ మీటింగ్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించే వీలు లేకపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది

Update: 2020-09-12 06:07 GMT

BCCI will not have its AGM by September 30, 2020: Secretary to state bodies

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వాయిదా ప‌డింది. ఈ మీటింగ్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించే వీలు లేకపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనుబంధ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బోర్డు కార్యదర్శి జైష లేఖ రాసినట్లు బీసీసీఐ తెలిపింది. తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ – 1975 కింద బీసీసీఐ రిజిస్టర్ అయి ఉంది. నిబంధనల ప్రకారం ప్రతీ ఏడాది సెప్టెంబర్ 30లోగా ఏజీఎం నిర్వహించాల్సి ఉంటుంది.

ఇపుడున్న కరోనా పరిస్థితుల్లో ఆలోపు నిర్వహించడం కుదరట్లేదు. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న మీదటే ఏజీఎంను వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెలాఖరులోపు తప్పనిసరిగా ఏజీఎం నిర్వహించాల్సిన అవసరమైతే లేదని, తదుపరి ఎప్పుడు ఏజీఎం ఉంటుందనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని జై షా వివరించారు.

ఐపీఎల్‌ తదితర కీలకాంశాలపై చర్చించేందుకు బోర్డు గతంలో వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించింది. చివరిసారిగా బోర్డు ఏజీఎం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. అప్పుడే మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

Tags:    

Similar News