పీసీబీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీసీసీఐ
భారత్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ ఇషాన్ మని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది.
పదేళ్ల తర్వాత పాక్‌లో టెస్టు క్రికట్ ఆడడం విజయవంతం కావడంతో పీసీబీ సంతోషంగా ఉంది. భారత్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ ఇషాన్ మని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. భద్రతా పరంగా పాకిస్థాన్ కన్నా భారతే ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు. శ్రీలంక పాకిస్థాన్ టెస్ట్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇషాన్ ..పాక్‌లో క్రికెట్ ఆడటం ప్రమాదకరం కాదు, అది మేము నిరూపించాం అన్నారు. అయితే పాకిస్తాన్ లో భద్రతాపరమైన ప్రమాదం ఉందని నిరూపించాలని సవాల్ చేశారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ ఇషాన్ మని వ్యాఖ్యలపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ లో భద్రతపై దృష్టి పెడితే బాగుంటుంది. భారత్ సంగతి మేము చూసుకుంటామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ మహీమ్ విమర్శించారు. భారత్‌లో విషయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎందుకంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మహీమ్ మాట్లాడుతూ.. భారత్‌లో భద్రత గురించి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం మీకు లేదు.
పాకిస్థాన్ లో రక్షణ గురించి దృష్టి పెట్టండి అంటూ వ్యాఖ్యానించారు. మా సెక్యూరిటీ మేము చూసుకుంటాము, భారత్ లో పటిష్టమైన భద్రతలో మ్యాచ్ నిర్వహించే సత్తా ఉంది. భారత్ నుంచి విమర్శించడం మానీ మీ పనేదో చూసుకోండి. మహీమ్ వర్మ వ్యాఖ్యానించారు.
అయితే తాజా శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. మూడు టీ20లు , రెండు టెస్టులు ఆడింది. కరాచీ వేదికగా జరిగిన చివరి టెస్టులో 208పరుగుల తేడాలో శ్రీలంకపై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. దీంతో పాక్ 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది.