Team India: తిలక్ వర్మ అవుట్..అయ్యర్ ఇన్..టీమిండియాలో భారీ ప్రకంపనలు సృష్టించిన బీసీసీఐ నిర్ణయం

Team India : భారత క్రికెట్ నియంత్రణ మండలి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం టీమిండియాలో కీలక మార్పులు చేసింది.

Update: 2026-01-17 02:59 GMT

Team India: తిలక్ వర్మ అవుట్..అయ్యర్ ఇన్..టీమిండియాలో భారీ ప్రకంపనలు సృష్టించిన బీసీసీఐ నిర్ణయం 

Team India: భారత క్రికెట్ నియంత్రణ మండలి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం టీమిండియాలో కీలక మార్పులు చేసింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ చాలా కాలం తర్వాత మళ్ళీ టీ20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గాయాల కారణంగా వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ జట్టుకు దూరం కావడంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 21 నుంచి 31 వరకు జరగనున్న ఈ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యువ సంచలనం తిలక్ వర్మ గాయం కారణంగా మొదటి మూడు టీ20లకు దూరం కాగా, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను, సుందర్ స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేశారు. 2026 టీ20 ప్రపంచకప్‌కు గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఈ కీలక ఆటగాళ్ల గాయాలు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి.

శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 ఆడాడు. అయితే, ఐపీఎల్ 2025లో అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 604 పరుగులు చేయడమే కాకుండా, 175 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఆ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకునే సెలెక్టర్లు అతనికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. మిడిల్ ఆర్డర్‌లో అయ్యర్ రాకతో టీమ్ ఇండియా బ్యాటింగ్ లైన్ అప్ మరింత పటిష్టంగా మారింది.

మరోవైపు రవి బిష్ణోయ్ కూడా ఏడాది కాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు 42 టీ20 మ్యాచ్‌లు ఆడిన బిష్ణోయ్, 61 వికెట్లతో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. సుందర్ స్థానంలో వచ్చిన బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తితో కలిసి స్పిన్ ద్వయాన్ని ఎలా నడిపిస్తాడనేది చూడాలి. న్యూజిలాండ్ పిచ్‌లపై బిష్ణోయ్ గూగ్లీలు కీలకం కానున్నాయి.

టీమిండియా స్క్వాడ్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (మొదటి 3 టీ20లకు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (కీపర్), రవి బిష్ణోయ్.

Tags:    

Similar News