IPL 2020 : కరోనా ముప్పుపై స్పందించిన బీసీసీఐ

Update: 2020-03-04 10:33 GMT
ఐపీఎల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 మ్యాచ్‌ల నిర్వాహన వల్ల కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడంపై రకరకాల ఉహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్‌పై కరోనా ప్రభావం ఉండదని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. కరోనా వైరస్ కేసులు దేశంలో కొన్ని గుర్తించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ నిర్వహిచండం లేదని వచ్చిన వార్తలు గాలి వార్తాలేనని బ్రిజేష్ కుమార్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ గురించి తాము ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తు్న్నా్ట్లు మంగళవారం బ్రిజేష్ పటేల్ తెలిపారు.

ఐపీఎల్ నిర్వహణపై వచ్చిన వార్తలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఖండించారు. టీమిండియా దక్షిణాఫ్రికా మధ్య జరిగే వన్డే సిరీస్‌కు, ఐపీఎల్‌కు కరోనా వైరస్‌తో వచ్చే సమస్య లేదని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం లేదని, దానిపై చర్చ కూడా అనవసరమని పేర్కొన్నారు. కాగా.. మార్చి 29న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌ జరగనుంది.

మార్చి 12న ధర్మశాల వేదికగా జరిగే తొలి వన్డే మ్యాచ్‌ భారత్ సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే 12న ధర్మశాలలో, రెండో వన్డే 15న ల‌క్నో, మూడో వన్డే 18న కోల్‌క‌తాలో జ‌రుగనున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి దాటికి 3100 మంది మరణించిన విషయం తెలిసిందే. సుమారు 90,000 మందికి ఈ మహమ్మారి సోకింది. ఈ వ్యాధి భారత దేశంలో కూడా వ్యాపించింది. దేశంలో మొదట కరోనా వ్యాధి లక్ష్యణాలు బయటపడ్డాయి. ఢిల్లీ, తెలంగాణలో ఈ వ్యాధి లక్షణాలు బయటడ్డాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మార్కెటింగ్ వ్యవస్థలు కుల్పకూలాయి. ఐపీఎల్ నిర్వహణపైనూ సౌతాఫ్రికా భారత్ సిరీస్ పై అనుమానాలు వ్యాక్తమైయ్యాయి. ఆ సిరీస్ లు యథాతథంగా కొనసాగుతాయని గంగూలీ స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఇప్పటికే క్రికెట్లర్ల మధ్య కరచాలనం కూడా నిషేదించింది. ఇక దీని దెబ్బకు చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దయ్యాయి. కరోనా దెబ్బకు ఒలింపిక్స్ నిర్వహణపై అనుమానం నెలకొంది.  





Tags:    

Similar News