BCCI: ఆప్ఘాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ, రోహిత్ కు నో ఛాన్స్.. హార్థిక్ కు పగ్గాలు

BCCI: ఆప్ఘాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ, రోహిత్ కు నో ఛాన్స్.. హార్థిక్ కు పగ్గాలు

Update: 2023-05-27 06:24 GMT

BCCI: ఆప్ఘాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ, రోహిత్ కు నో ఛాన్స్.. హార్థిక్ కు పగ్గాలు

BCCI: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా తన సొంతగడ్డపై ఆఫ్ఘానిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆప్ఘానిస్తాన్ తో వన్డే సిరీస్ రద్దయ్యే ఛాన్స్ ఉందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, ఈ సిరీస్ ను నిర్వహించాలని బీసీసీఐ మాత్రం గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో సిరీస్ ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

ఆఫ్ఘానిస్తాన్ తో సిరీస్ కు టీమిండియా రెగ్యులర్ ఆటగాళ్లైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ తలపోస్తోంది. ఎందుకంటే టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లతో ఆఫ్ఘానిస్తాన్ సిరీస్ నిర్వహిస్తే ఆటగాళ్లు అలసి పోయే ప్రమాదం ఉంది. అందుకే వారికి వెస్టిండీస్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈక్రమంలోనే ద్వితీయశ్రేణి ఆటగాళ్లతో ఆఫ్ఘానిస్తాన్ సిరీస్ ను నిర్వహించాలని బీసీసీఐ తలపోస్తోంది.

ఆఫ్ఘానిస్తాన్ తో ఆడేందుకు భారత జూనియర్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను హార్థిక్ పాండ్యాకు అప్పగ్గించాలని బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. అలాగే ఐపీఎల్ లో అందరి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వీని టీమిండియాలోకి తీసుకోవాలనుకుంటోంది. అదే విధంగా సీఎస్కే ఆటగాడు రుత్ రాజ్ గైక్వాడ్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారట. మొత్తంగా చూస్తుంటే ఆఫ్ఘానిస్తాన్ సిరీస్ తో టీమిండియాలోకి నూతన ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చేలా ఉన్నారు.

Tags:    

Similar News