బీబీఎల్..ఔట్‌కు అప్పీలు చేస్తే అంపైర్ ఎంచేసాడో తెలుసా
బీబీఎల్‌లో లీగ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
బీబీఎల్‌లో లీగ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అఫ్గానిస్తాన్ మాజీ కెప్టెన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బిగ్‌బాష్‌లీగ్‌లో సంచలనం సృష్టిచాడు. అయితే ప్రస్తుతం బీబీఎల్‌లో అతడు ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో బౌల్ తో కాకుండా రషీద్ ఖాన్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. బీబీఎల్‌లో ఆదివారం అడిలైడ్ స్ట్రైకర్స్ , మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున రషీద్ ఖాన్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో 16 బంతుల్లో 25 పరుగలతో చెలరేగిపోయాడు. 2 ఫోర్ల్, 2 సిక్స్‌లు కూడా ఉన్నాయి. ఇక బౌలింగ్ లో 2 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఈ మ్యాచ్‌లో రషీద్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘనట చోటు చేసుంది. రషీద్ వేస్తున్న 17వ ఓవర్‌లో రషీద్ బంతిని మెల్‌బోర్న్ బ్యాట్స్‌మెన్ వెబ్‌స్టార్ ప్యాడ్‌లను తాకింది. దీంతో రషీద్ ఎల్‌బీడబ్ల్యూకు అప్పీలు కోరాడు. అయితే ఆదే సమయంలోనే అంపైర్ గ్రెగ్ డేవిడ్సన్ ముక్కు పై వేలు పెట్టుకోవడంతో.. అంపైర్ చేయి పైకి లేపినట్టు కనిపించింది దీంతో ఆటగాళ్లు ఔట్ అనుకొని సంబరాల్లో మునిగిపోయారు. బ్యాట్స్ వెబ్‌స్టార్ క్రీజ్ వదిలి ముందుకు నడిచాడు. వెంటనే అంపైర్ తేరుకుని ఔట్ ప్రకటించలేదని వివరణ ఇచ్చుకున్నాడు. ఒక్కసారిగా ఔట్ అనుకుని సంబరాల్లో మునిగిపోయిన అడిలైడ్ స్ట్రైకర్స్ ప్లేయర్లు నిరాశచెందారు. దీంతో క్రికెట్ వీక్షిస్తున్న వారంతా నవ్వుకున్నారు.
అయితే రషీద్ ఖాన్ బ్యాట్‌ను ది కెమల్ బ్యాట్ అంటూ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. రషీద్ బ్యాటింగ్ సరళిపై సన్‌రైజర్స్ స్పందించింది. 2020 రషీద్ న్యూవ్వు ఆడిన బ్యాట్‌ను 2020 ఐపీఎల్‌కు తీసుకురా అని సన్ రైజర్స్ ట్వీట్ చేసింది. సన్‌రైజర్స్ ట్వీట్‌కు ఆ జట్టు ఆడగాడు రషీద్ ఖాన్ బదులిచ్చాడు. ఐపీఎల్ 2020 కెమల్ బ్యాట్ తీసుకొస్తానని స్పష్టం చేశాడు.
ఈ మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఫిలిప్ 54 పరుగు చేశాడు. ఆలెక్స్ 41పరుగులు చేశాడు. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ బౌలర్లలో రిచర్డ్సన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏనిమిది వికెట్లు కొల్పోయి 137పరుగులు మాత్రమే చేసింది. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. 18పరుగుల తేడాతో విజయం సాధించింది.
👃 Greg Davidson with a bit of an itchy schnoz at Marvel Stadium #nosegate #BBL09 pic.twitter.com/m3M772Atox
— KFC Big Bash League (@BBL) December 29, 2019