Smriti Mandhana: స్మృతి మందానను రూ.3.40 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు

Smriti Mandhana: స్మృతి మందానను దక్కించుకున్న బెంగళూరు

Update: 2023-02-13 13:23 GMT

Smriti Mandhana: స్మృతి మందానను రూ.3.40 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు

Smriti Mandhana: మహిళల ఉమెన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ప్లేయర్ల కోసం ఐదు టీమ్​లు పోటీపడుతున్నాయి. ఈ వేలంలో 409 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో 246 మంది దేశీయ ప్లేయర్లు..163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కాగా, టీమ్ఇండియా ప్లేయర్ స్మృతి మంధాన రికార్డు ధర పలికింది. స్మృతి మంధానను రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు 3.40 కోట్లకు దక్కించుకుంది. భారత జట్టు కెప్టెన్ హర్మన్​ప్రీత్​ కౌర్​ను 1.80 కోట్లకు ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ అస్లీ గార్డ్‌నర్ కోసం ముంబయి ఇండియన్స్, యూపీ వారియర్స్​ జట్లు పోటాపోటీగా బిడ్డింగ్​ వేశాయి. చివరకు గుజరాత్​ జెయింట్స్​ జట్టు 3.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక, మరో ఆసీస్​ ఎలిస్​ పెర్రీ కూడా భారీ ధర పలికింది. ఈ క్రికెటర్​ను రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు 1.70 కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ సోఫీ ఎక్లెస్టోన్ కోసం యూపీ వారియర్స్​, ఢిల్లీ క్యాపిటల్స్​ పోటీ పడ్డాయి. ఆఖరుకు యూపీ వారియర్స్​ సోఫీ ఎక్లెస్టోన్‌ను 1.80 కోట్లకు కొనుగోలు చేసింది.

Tags:    

Similar News