ఈ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టాప్ ఆటగాళ్లు వీరే
ఆస్ట్రేలియన్ ఓపెన్ -2020కి ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి గ్రాండ్ స్లామ్ టోర్ని జరగనుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ -2020కి ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి గ్రాండ్ స్లామ్ టోర్ని జరగనుంది. అస్ట్రేలియాలోని వెల్‌బోర్న్ వేదికగా ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ స్టార్ ప్లేయర్ల పాల్గొన్ననున్నారు. ఈ గ్రాండ్ స్లామ్ పాల్గొనే క్రీడాకారుల జాబితాను ఇటీవలే నిర్వాహాకులు ప్రకటించారు.
ఈ టోర్నీలో మహిళల విభాగంలో విక్టోరియా అజరెంకా మినహా టాప్-50 ప్లేయర్లు పాల్గొననున్నారు. ఇక పురుషుల్లో విభాగంలో అగ్రస్థానంలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఈ టోర్నీలో ప్రాధానాకర్షణగా నిలవగా, మహిళల విభాగంలో ఆష్లే బార్టీ ఈ టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
ఎనిమిదో గ్రాండ్ స్లామ్ టోర్నీ విజయంపై నొవాక్ జొకోవిచ్ కన్నేశాడు. దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ తన తన కెరీర్‌లో 7వ గ్రాండ్ స్లామ్ ట్రోఫ్రీని సాధించాలని పట్టుదలతో ఉన్నాడు.
మహిళల విభాగంలో ఏడుసార్లు ఛాంపియన్ నిలిచిన సెరెనా విలియమ్స్ మళ్లి విజయంపె గురిపెట్టింది. మార్గరెట్ కోర్ట్ రికార్డును సమయం చేయాలని చూస్తుంది. ఆస్ట్రేలియన్ టెన్నీస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ తన కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల ఆడిన క్రీడాకారినిగా రికార్డును కైవసం చేసుకుంది.
నొవోమి ఒసాకా (జపాన్), కరోలిన్ వోజ్నియాకి, సెరెనా విలియమ్స్, నొవాక్ జొకోవిచ్ , రోజర్ ఫెదరర్ , రఫెల్ నాదల్ దిగ్గజ ప్లేయర్లతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ సందడిగా మారనుంది.