T20 World Cup 2021: ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

* 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం * స్కోర్లు: న్యూజిలాండ్ 172/4, ఆస్ట్రేలియా 173/2

Update: 2021-11-15 01:11 GMT

ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం(ఫైల్ ఫోటో)

T20 World Cup 2021: T20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ 85 పరుగులతో చెలరేగాడు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 2 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్‌ మార్ష్‌77, డేవిడ్‌ వార్నర్ 53 పరుగులతో వీరవిహారం చేశారు. దీంతో ఆజట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Full View


Tags:    

Similar News