భారీ మార్పుల తర్వాత.. భారత్‌లో పర్యటించనున్న ఆసీస్ జట్టు ఇదే..
టీమిండియా విండీస్ వన్డే సిరీస్ డిసెంబర్ 22తో ముగుస్తుంది. 2020లో భారత్ గడ్డపై ఆస్ట్రేలియా అడుగుపెట్టనుంది.
టీమిండియా విండీస్ వన్డే సిరీస్ డిసెంబర్ 22తో ముగుస్తుంది. 2020లో భారత్ గడ్డపై ఆస్ట్రేలియా అడుగుపెట్టనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రెండు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టను ప్రకటించింది.
భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ సారి స్టార్ ఆటగాళ్లుకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. షాన్ మార్ష్, కౌల్టర్ నైల్, నాథన్ లయాన్, ఉస్మాన్ ఖవాజా, మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లకు వన్డే జట్టులో స్థానం దక్కలేదు. కంగారు జట్టు ఆల్‌రౌండర్ సీన్ అబోట్ 5 ఏళ్ల తర్వాత తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు.
మార్నస్ లబుషేన్ భారత్ పర్యటనలో తన వన్డే ఫార్మాట్ లో ఆరంగేట్రం చేయనున్నారు. టెస్టుల్లో లబుషేన్ 58.05 రన్‌రేటుతో పరుగులు చేసాడు. పాకిస్థాన్ లో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ లో సెంచరీలతో అలరించాడు. టీ20 ప్రపంచ కప్ ముందు నిర్వహించనున్న వన్డే సిరీస్ ను ఆసీస్ ప్రాతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టెస్టుల్లో రాణిస్తున్న మార్నస్ లబుషేన్‌కు వన్డే జట్టులో చోటు కల్పించింది.
జట్టు ఎంపిక సందర్భంగా మాట్లాడిన చీఫ్ సెలక్టర్ ట్రెవర్ హోన్స్ లబుషేన్ టెస్టు క్రికెట్లో కూడా రాణించగలడని భావిస్తున్నామని, ఆస్టన్ టర్నర్ భారత్‌లో లోని పరిస్థితులను అర్థం చేసుకొని సత్తాచాటుతాడని భావిస్తున్నామని తెలిపారు.
ఆసీస్ హెడ్ కోచ్‌గా మెక్ డొనాల్డ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఆసీస్ జట్టు భారత్ పర్యటన జనవరి 14 నుంచి 19 వరకు ఉంటుంది. 14న ముంబైలో తొలి వన్డే ఆడనుంది. 17తేదీన రాజ్‌కోట్ రెండో వన్డే, 19న బెంగళూరు మూడో వన్డే రెండు జట్ల మధ్య జరగనున్నాయి. భారత జట్టును కూడా బీసీసీ ప్రకటించనుంది.
ఆసీస్ జట్టు ఇదే :
అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, అబాట్, ఆస్టన్ అగర్, హేజిల్‌వుడ్, మార్నస్ లబుషేన్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, ఆస్టన్ టర్నర్, పాట్ కమిన్స్, హ్యాండ్స్‌కాంబ్, ఆడమ్ జంపా.