India vs South Africa 2nd test: మరో రికార్డ్ సొంతం చేసుకున్న భారత్

వరుస రికార్డులతో భారత్ జట్టు దూకెళ్తుంది. తాజాగా సౌతాఫ్రికా జట్టుపై విజయంతో మరో రికార్డును పదిలపరుచుకుంది. అంతే కాకుండా ఆస్ట్రేలియా రికార్డ్ బ్రేక్ చేసింది.

Update: 2019-10-13 11:16 GMT

టెస్టు కెరీర్‌లో భారత్ మరో రికార్డు సృష్టించింది. 10 ఏళ్లనాటి ఆస్ట్రేలియా రికార్డ్ బ్రేక్ చేస్తూ చారిత్రాత్మక విజయం నమోదు చేసుకుంది. పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించింది. సఫారీపై ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం నమోదు చేసుకుంది. ఒక టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ని 2-0తో భారత్ దక్కించుకుంది. సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 11వ టెస్టు సిరీస్ విజయం.

ఆస్ట్రేలియా 1994-2001, 2004-09 మధ్యకాలంలో 10 సిరీస్ విజయాలతో సొంతగడ్డపై ఎక్కువ టెస్టులు గెలిచిన జట్టుగా నిలిచింది. అయితే‎ తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌ విజయంతో టీమిండియా ఆ రికార్డ్‌ని తిరగ రాసింది. 2012-19 కాలంలో భారత్ వరుసగా 11 టెస్టు సిరీస్ విజయాలతో ఆస్ట్రేలియా రికార్డ్‌ని బ్రేక్ చేసింది. 2012-13లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ని 4-0తో గెలిచింది. టెస్టు ఫార్మెట్ లోని అన్ని జట్లతో భారత్ తలపడింది. అన్ని జట్లపై సంచలన విజయాలు నమోదు చేసుకుంది.  

Tags:    

Similar News