Priest Rangarajan Letter to Ramnath Kovind: రాష్ట్రపతికి లేఖ రాసిన దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త రంగరాజన్‌

Priest Rangarajan Letter to Ramnath Kovind: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త రంగరాజన్‌ కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం కేసు విషయమై భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవిద్‌కు లేఖరాశారు

Update: 2020-06-30 08:17 GMT

Priest Rangarajan Letter to Ramnath Kovind: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త రంగరాజన్‌ కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం కేసు విషయమై భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవిద్‌కు లేఖరాశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని విలేకరులకు తెలియజేశారు. ఎన్నో ఏండ్ల క్రితం కోర్టుకెక్కిన అనంతపద్మనాభ స్వామి దేవాలయం కేసు విషయంలో ఎందుకు సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ధర్మానికి విరుద్ధంగా ఇప్పటికే శబరిమల ఆలయం తీర్పును కోర్టు ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. అంతే కాకుండా ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే పూరీ జగన్నాథ్‌ రథయాత్ర విషయంలో కూడా కోర్టు తీర్పును మార్చుకుందని తెలిపారు. ముందగా రథయాత్ర నిర్వహించొద్దని తీర్పు ఇచ్చిన కోర్టు ప్రజల ఆగ్రహాన్ని గమనించి పరిమిత సంఖ్యలో భక్తులతో రథయాత్ర తీయొచ్చని తన తీర్పును తానే మార్చుకుందన్నారు.

హిందూ దేవతల విషయంలో సుప్రీంకోర్టు వ్యవహారశైలి సరిగా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటితో న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతుందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26 ప్రకారం దేవాలయాల్లో కొలువుండే దైవుళ్లకు అధికారాలు ఏమీ లేవని ఉందన్నారు. అందుకే భగవంతుడు కరోనా నుంచి భక్తులను కాపాడే అధికారాన్ని కోల్పోయాడేమో అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం తీర్పును రాష్ట్రపతి తన విశిష్ట అధికారాన్ని వినియోగించుకుని హిందువుల మనోభావాలకు అనుగుణంగా వెలువరించే విధంగా సుప్రీంకోర్టును ఆదేశించాలని కోరుతూ లేఖ రాశానని వెల్లడించారు.

Tags:    

Similar News