Top
logo

శక్తి పీఠాల్లో శాంకరీదేవి ఆలయం ఏ స్థితిలో ఉందో తెలుసా..?

శక్తి పీఠాల్లో శాంకరీదేవి ఆలయం ఏ స్థితిలో ఉందో తెలుసా..?Shankari Devi
Highlights

అష్టాదశ శక్తిపీఠాల్లో శాంకరీదేవి శక్తిపీఠం మొదటిది. ఈ శక్తిపీఠం పొరుగుదేశం పురాణాల్లో సింహళద్వీపం అనిపిలవబడే శ్రీలంకలో ఉండేదని పూర్వీకులు చెప్పేవారు.

రావణ స్తుతి సంతుష్టా కృతాలంకాధివాసినీ |

సీతాపహరణరోషేణ త్యక్తలంకామహేశ్వరీ |

సజ్జన స్తితి సంతుష్టా కదంబవన వాసినీ |

లంకాయం శాంకరీదేవి రక్షేత్ ధర్మపరాయణా ||

అష్టాదశ శక్తిపీఠాల్లో శాంకరీదేవి శక్తిపీఠం మొదటిది. ఈ శక్తిపీఠం పొరుగుదేశం పురాణాల్లో సింహళద్వీపం అనిపిలవబడే శ్రీలంకలో ఉండేదని పూర్వీకులు చెప్పేవారు. శాంకరీ దేవిని మహర్షులు వనశంకరి అని కూడా పలిచెడి వారు. వనం అంటే నీరు, అడవి అని అర్ధం వస్తుంది. శాంకరీ దేవి వెలసిన లంక చుట్టూ నీరు ఉంటుంది. ఏ విధంగా చూసినా వనశాంకరీదేవి, లంకా శక్తిపీఠసంస్థితగానే భావించాలి. ఈ తల్లి రాక్షసగుణాలను సంహరించి, ధర్మాన్ని రక్షిస్తూ భక్తులను పాలించేది.

శక్తిపీఠాం ఎలా వెలసింది...

దక్షుడు బృహస్పతియాగం చేసినపుడు దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులని పిలవలేదు. అయినా పార్వతీ దేవి శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు దర్శనమిస్తున్నాయి. అలా వెలసిందే శాంకరీదేవి శక్తిపీఠం.

మహావిష్ణువు పార్వతి శరీరాన్ని ఖండాలుగా చేసిన మయంలో సతీదేవి కాలిగజ్జెలు శ్రీలంక ద్వీపంలోని తూర్పు తీరప్రాంతములో ట్రింకోమలిపుర లో పడిందని చెపుతుంటారు. దీంతో ఇక్కడ శాంకరీదేవి ఆలయాన్ని కట్టారని పూర్వీకుల వాదన. కాగా ప్రస్తుత కాలంలో ఈ శక్తి పీఠం శిధిలమై పోయిందని చెపుతుంటారు. ఆ ప్రాంతంలో ఒకనాడు శక్తి పీఠం ఉంది అనడానికి ఆనవాలుగా ఓ స్థంబం మాత్రమే దర్శనం ఇస్తుందని చెపుతున్నారు. దీంతో శాంకరీదేవి దర్శనం దుర్లభం అనే చెప్పుకోవాలి. శాంకరీదేవి ఆలయ దర్శనం నేడు శూన్యం అయినా, క్షేత్ర మహాత్యం, క్షేత్ర దర్శనము ఆనందదాయకమే.

ఆలయం ఏ స్థితిలో దర్శనం ఇస్తుంది..

ఈ ఆలయం శిధిలమైపోవడానికి కారనం అలనాడు బౌద్ధమతం, క్రైస్తవమతం అభివృద్ధి చెందడమే అని చరిత్ర చెపుతుంది. దీంతో హిందూమతానిక ఆదరణ కరువై హిందూ దేవాలయాలన్నీ శిథిలముగా మారినాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. శాంకరీదేవి మందిరం కూడా ఆ కోవలోనే కాలగర్భంలో కలిసిపోయి వుండవచ్చునని సమాచారం. ఆ కాలంలోనే శ్రీలంకలో ఉన్న తమిళులపై దాడులు హింసాత్మకమవటంతో వారు తట్టుకోలేక పారిపోయి కెనడా, ఇండియా మొదలగు దేశములకు చేరిన హిందువుల సంఖ్య పెరిగిపోయింది.

ఎలా చేరుకోవాలి..

గలోయపట్టణం మీదుగా శ్రీలంక ప్రభుత్వం రైలు మార్గం వుండగా, కాండిపట్టణం, గలోయ పట్టణముల మీదుగా రోడ్డు మార్గంలో వెలుతుంది.

Web TitleAstadasha Shakti peetam Shankari Devi History
Next Story


లైవ్ టీవి