ఇలా తయారేంట్రా స్వామి.. భర్త నాలుకను కొరికి మింగిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్..

Bihar: భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు, చివరికి రక్తపాతం వరకు దారితీసిన ఘటన బీహార్ రాష్ట్రం గయాలో జరిగింది.

Update: 2025-07-24 05:09 GMT

ఇలా తయారేంట్రా స్వామి.. భర్త నాలుకను కొరికి మింగిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్..

Bihar: భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు, చివరికి రక్తపాతం వరకు దారితీసిన ఘటన బీహార్ రాష్ట్రం గయాలో జరిగింది. ఖిజ్రాసరాయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న దంపతుల మధ్య చిన్నపాటి గొడవ చెలరేగింది. అయితే మాటామాటా పెరిగి అది కాస్తా హింసాత్మకంగా మారింది.

ఆక్రమంలో భార్య అతి ఆగ్రహంతో భర్తపై దాడి చేయగా, అతని నాలుకను కొరికి నమిలి మింగేసిన ఘోర చర్యకు పాల్పడింది. ఈ ఘటనతో భర్త తీవ్రంగా గాయపడి, విపరీతమైన రక్తస్రావం జరగడంతో స్థానికులు అతన్ని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు, పరిస్థితి విషమంగా ఉన్నందున మగధ్ మెడికల్ కాలేజ్‌కి రిఫర్ చేసినట్లు డాక్టర్ మీనారాణి తెలిపారు.

ఇంత జరిగినా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఆ దంపతుల మధ్య వాగ్వాదం కొనసాగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో మానవ సంబంధాల్లో సహనాన్ని కోల్పోతే ఎంత దారుణమైన పరిణామాలు చవిచూడాల్సి వస్తుందో స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News