టీఎంసీ, క్యూసెక్కు అంటే ఏమిటి.. ఈ పదాలకు అర్థం ఏమిటో తెలుసా..?

Heavy Floods: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వరదలు భారీగా ముంచెతున్నాయి.

Update: 2022-07-15 10:43 GMT

టీఎంసీ, క్యూసెక్కు అంటే ఏమిటి.. ఈ పదాలకు అర్థం ఏమిటో తెలుసా..?

Heavy Floods: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వరదలు భారీగా ముంచెతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లు తున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి. ఈ క్ర‌మంలో ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తూనే ఉన్నారు. న‌దుల‌కు, ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద పోటెత్తిన‌ప్పుడ‌ల్లా టీఎంసీ, క్యూసెక్కు అనే ప‌దాలు వాడుతూనే ఉంటారు. నీటి నిల్వ గురించి మాట్లాడినప్పుడు టీఎంసీలలో, నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో గురించి మాట్లాడితే క్యూసెక్కులలో చెప్పాలి. మ‌రి టీఎంసీ, క్యూసెక్కుల‌ అర్థం ఏంటో తెలుసుకుందాం.

ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి పరిమాణం చెప్పటానికి ఉపయోగించే ప్రమాణము టీఎంసీ (TMC) అంటే THOUSAND MILLION CUBIC FEET అని అర్థం. మనం ఒక టీఎంసీ విలువ 2,830 కోట్ల లీటర్లు ఉంటుంది. ఇక క్యూసెక్ (CUSEC) అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం. CUSEC అంటే CUBIC FEET PER SECOND అని అర్థము. దీని విలువ సెకనుకు 28 లీటర్ల అవుతుంది. బ్యారేజ్ గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశాము అంటే ఒక సెకను కాలంలో గేట్ల ద్వారా 28 లక్షల లీటర్ల నీరు విడుదలైంది అని అర్థం. 

Tags:    

Similar News