Viral Video: రైల్లో మహిళల జుట్టుపట్టుకుని గొడవ… ఇంత దాకా ఎవరూ ఊహించలేరు!

Update: 2025-07-03 16:18 GMT

Viral Video: రైల్లో మహిళల జుట్టుపట్టుకుని గొడవ… ఇంత దాకా ఎవరూ ఊహించలేరు!

Viral Video:  సీట్ల కోసం సిటీపాట్లు ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో ఎప్పుడూ జరిగే దృశ్యాలే. కానీ తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. సిఎస్‌టీ-కళ్యాణ్‌ మార్గంలోని డోంబివిలి సమీపంలో మహిళా ప్రయాణికులు ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రయాణికులతో నిండిన రైలులో చోటుచేసుకున్న ఈ ఘర్షణలో ఒక మహిళ మరొకరిపై దాడికి దిగిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వారిని వెనక్కు లాగేందుకు ఇతర మహిళలు ప్రయత్నించినా, గొడవ ఆగలేదు. ఈ దృశ్యాలు రైలులో ఉన్న ప్రయాణికులు తీసిన వీడియో ద్వారా వెలుగులోకి వచ్చాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుర్లా RPF సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికే గొడవలో పాల్గొన్న మహిళలు రైలు నుంచి దిగి వెళ్లిపోయారు. వీడియో చూసిన నెటిజన్లు ఎప్పటిలాగే హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు. “ఇది ట్రైన్‌లో జరుగుతోందా లేక ఫిష్ మార్కెట్లోనా?”, “ఇలాంటి పరిస్థితులు మారాలంటే కఠిన చర్యలు అవసరం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో మరోసారి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో స్థలాల కోసం జరుగుతున్న అసహనాన్ని హైలైట్ చేస్తోంది.

వీడియోను చూసేందుకు వెయిట్ ఎందుకు? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్!



Tags:    

Similar News