Viral Video: ఎడారిలో ఇసుక అమ్మడం అంటే ఇదే కాబోలు.. వైరల్ వీడియో..!
Viral Video: వాడు చాలా తెలివైన వాడు, వ్యాపారం ఎలా చేయాలో వాడి నుంచే నేర్చుకోవాలి అని చెబుతుంటారు.
Viral Video: ఎడారిలో ఇసుక అమ్మడం అటే ఇదే కాబోలు.. వైరల్ వీడియో
Viral Video: వాడు చాలా తెలివైన వాడు, వ్యాపారం ఎలా చేయాలో వాడి నుంచే నేర్చుకోవాలి అని చెబుతుంటారు. ఎడారిలో ఇసుక ఉచితంగా లభిస్తుందని తెలిసిందే. అయితే తెలివైన వ్యాపారావేత్తల గురించి ప్రస్తావిస్తూ ఎడారిలో ఇసుక అమ్ముకొని కూడా బతికేస్తాడు అని చెబుతుంటారు.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఇది అక్షరాల సత్యం అనిపించకమానదు. తెలివి ఉంటే సంపాదన మార్గాలు ఎప్పుడూ దొరుకుతాయన్నడానికి ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. మనుషులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కొందరు ఆ పరిస్థితిని అవకాశంగా మార్చుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో కూడా అదే చెబుతోంది.
ఈ వీడియోను studentgyaan అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇద్దరు యువకులు ఒక డివైడర్ పక్కన నిలబడి ఉన్నారు. ఆ డివైడర్ సాధారణ ఎత్తులో కాకుండా కాస్త ఎక్కువ ఎత్తులో ఉంది. దీంతో దానిని దాటడం కష్టంగా మారింది. లేదంటే చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది.
దీంతో ఈ ఇద్దరూ అక్కడికి నిచ్చెన తీసుకొచ్చి ప్రజలకు దానిని దాటేందుకు సహాయం చేస్తున్నారు. కానీ ఉచితంగా కాదు — ముందుగా డబ్బు తీసుకుంటారు. ఆ తర్వాతే డివైడర్ దాటే అవకాశం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఆ వీడియోను 6 లక్షల మందికి పైగా చూశారు, లక్షల్లో లైక్స్ వచ్చాయి. నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. “ఇది అసాధారణ ఆలోచన”, “తెలివి ఉంటే అవకాశాలు వస్తూనే ఉంటాయి” అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.