Viral Video: వీళ్ల క్రియేటివిటీ తగలెయ్య.. ఐ ఫోన్‌ను ఎలా సెట్ చేశారో చూస్తే..!
Viral Video: నేటి టెక్నాలజీ యుగంలో, వస్తువులను వాటి అసలైన రూపం కాకుండా కొత్తగా మార్చడం సాధారణమైపోయింది.
Viral Video: వీళ్ల క్రియేటివిటీ తగలెయ్య.. ఐ ఫోన్‌ను ఎలా సెట్ చేశారో చూస్తే..!
Viral Video: నేటి టెక్నాలజీ యుగంలో, వస్తువులను వాటి అసలైన రూపం కాకుండా కొత్తగా మార్చడం సాధారణమైపోయింది. సైకిళ్లను బైకులుగా, బైకులను ఆటోలుగా, ఆటోలను కార్లుగా మార్చడం మనం చూశాం. అలాంటి వినూత్న ఆలోచనతో రూపొందించిన ఒక ఉత్పత్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల ఒక మేకప్ షాప్‌లో కనిపించిన ఐఫోన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మేకప్ దుకాణంలో ఐఫోన్లు ఎందుకు ఉన్నాయోనని చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే, ఆ ఫోన్‌కు ఉన్న వెనుక మూతను తెరిచి చూడగా, లోపల ఒక పూర్తి మేకప్ కిట్ కనిపించింది. అందులో అనేక రకాల మేకప్ రంగులు, చిన్న బ్రష్‌లు ఉన్నాయి. ఐఫోన్ తరహాలో ఈ మేకప్ బాక్స్‌ను డిజైన్ చేసిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేలల్లో లైకులు, లక్షలల్లో వ్యూస్‌తో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. "అదిరిందిగా.. ఐఫోన్ మేకప్ కిట్", "ఐఫోన్ 17 కొనాలనుకునేవారు దీన్ని ఎంచుకుంటే బాగుంటుందేమో" అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు "ఇది భారతదేశం, ఇక్కడ ఏదైనా సాధ్యమే" అంటూ సరదాగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. "ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇలాంటి ఐఫోన్లే వస్తాయేమో", "ఇది చైనా పీస్ అయి ఉంటుంది" వంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వినూత్నమైన ఉత్పత్తిపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.