Viral Video: పొలంలో కదలలేని స్థితిలో భారీ కొండచిలువ.. డౌట్ వచ్చి పొట్టను చీల్చి చూడగా..!

ఇండోనేషియాలోని సులవేసీ దీవిలో మజాపహిత్ గ్రామంలో జరిగిన గుండెను గుబాళించే ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది

Update: 2025-07-09 13:14 GMT

Viral Video: పొలంలో కదలలేని స్థితిలో భారీ కొండచిలువ.. డౌట్ వచ్చి పొట్టను చీల్చి చూడగా..!

ఇండోనేషియాలోని సులవేసీ దీవిలో మజాపహిత్ గ్రామంలో జరిగిన గుండెను గుబాళించే ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సాయంత్రం వరకు ఇంటికి రాని 63 ఏళ్ల రైతును కుటుంబ సభ్యులు గాలించడం ప్రారంభించారు. గాలింపు చర్యల్లో భాగంగా వారు పొలంలో 26 అడుగుల పొడవైన ఓ భారీ కొండచిలువను గుర్తించారు. ఆ పాము కదలలేని స్థితిలో ఉండటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు దాన్ని చంపి పొట్టను చీల్చగా, అందులో రైతు మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు.

రైతు బైక్ పొలానికి దగ్గరలో పార్క్ చేసి ఉండటం, అతని వస్తువులు చుట్టుపక్కల ఉండటంతో, అతను కొండచిలువకు బలయ్యాడని అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లాంటి దేశాల్లో 20 అడుగులకు పైగా ఉన్న కొండచిలువలు కనిపించడం సాధారణమే అయినా, మనుషులను మింగిన ఘటనలు మాత్రం చాలా అరుదు. 2017లో సలుబిరో గ్రామంలో 23 అడుగుల కొండచిలువ 25 ఏళ్ల యువకుడిని మింగిన ఘటన, అలాగే గతేడాది మహిళను 16 అడుగుల కొండచిలువ మింగిన ఘటనలు ఇప్పటికీ గుర్తుండేలా చేస్తాయి.

ఈ సంఘటనల నేపధ్యంలో అధికారులు కొండచిలువల సంఖ్యను లెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పొలాల్లో లేదా అడవి ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News