Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరింది: కొండచిలువను పట్టుకుని బురద నీళ్లలో ఆ యువతి ఏం చేసిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!

Python Video: సాధారణంగా పాము అంటేనే ఆమడదూరం పారిపోతాం. ఇక భారీ కొండచిలువ కనిపిస్తే గుండె ఆగిపోయినంత పనవుతుంది.

Update: 2026-02-09 09:52 GMT

Python Video: సాధారణంగా పాము అంటేనే ఆమడదూరం పారిపోతాం. ఇక భారీ కొండచిలువ కనిపిస్తే గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా క్రేజ్ కోసం కొందరు ప్రాణాలకు తెగించి వింత వింత విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి చేసిన సాహసం చూస్తే నెటిజన్లు షాక్ అవ్వాల్సిందే. ఏకంగా ఒక భారీ కొండచిలువపై కూర్చుని దానికి స్నానం చేయిస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

బురదలో ఉన్న కొండచిలువతో ఆటలు

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక యువతి బురద నీళ్లలో ఉన్న భారీ కొండచిలువను గుర్తించింది. భయపడటం పక్కన పెడితే, ఆమె దాన్ని అమాంతం పట్టుకుంది. ఆ భారీ పాము మెడను గట్టిగా పట్టుకుని, దాని శరీరంపై కూర్చుంది. ఆ యువతి బరువుకు, పట్టుకు కొండచిలువ కదలలేక విలవిలలాడిపోయింది. అంతటితో ఆగకుండా, కొండచిలువ ఒంటికి ఉన్న బురదను కడుగుతూ దానికి చక్కగా స్నానం చేయించింది. ఆమె పట్టు నుంచి తప్పించుకోవడానికి ఆ జీవి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు.

నెటిజన్ల విస్మయం.. సోషల్ మీడియాలో చర్చ!

ఈ వింత స్టంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నిమిషాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఇదెక్కడి పిచ్చి సాహసం? కొండచిలువ ఒకసారి చుట్టుకుంటే ఊపిరాడక చనిపోతారని తెలియదా?" అని ఒకరు కామెంట్ చేయగా.."లైక్స్ కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టకండి" అంటూ మరొకరు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల కాలంలో చాలామంది పాములు, కొండచిలువలను పెంపుడు జంతువుల్లా ఇళ్లలో ఉంచుకోవడం చూస్తున్నాం. అయితే, ఇవి ఎంత సాదు జంతువుల్లా కనిపించినా, వాటి సహజ గుణం మారదని, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News