బెంగళూరులో 'జిస్మత్ మండి' పంజా.. మారతహళ్లిలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించిన నటుడు ధర్మ మహేష్

Gismat Mandi Bengaluru: తెలుగు రాష్ట్రాల్లో భోజన ప్రియుల మనసు గెలుచుకున్న ప్రముఖ ఫుడ్ బ్రాండ్ 'జిస్మత్ మండి' (Gismat Mandi) ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరుకు విస్తరించింది.

Update: 2026-02-07 10:54 GMT

Gismat Mandi Bengaluru: తెలుగు రాష్ట్రాల్లో భోజన ప్రియుల మనసు గెలుచుకున్న ప్రముఖ ఫుడ్ బ్రాండ్ 'జిస్మత్ మండి' (Gismat Mandi) ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరుకు విస్తరించింది. సినీ నటుడు, సంస్థ అధినేత ధర్మ మహేష్ బెంగళూరులోని మారతహళ్లిలో తమ సరికొత్త ఔట్‌లెట్‌ను అత్యంత ఘనంగా ప్రారంభించారు. నాణ్యత, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ప్రీమియం వంటకాలను బెంగళూరు వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

కొడుకు పేరు మీద బ్రాండ్ - ఎమోషనల్ జర్నీ: ఈ సందర్భంగా ధర్మ మహేష్ మాట్లాడుతూ, 'జిస్మత్' అనేది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదని, తన కుమారుడి పేరులోని భావన అని వెల్లడించారు. "జిస్మత్ లెగసీ.. జగద్వాజ.. ఈ ప్రయాణం నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం" అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. లాభాల కంటే కస్టమర్ల సంతృప్తే తమ ప్రథమ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు.

బెంగళూరుతో ఉన్న పాత జ్ఞాపకాలు: తన గత స్మృతులను గుర్తు చేసుకుంటూ.. "హనుమాన్ జంక్షన్, గన్నవరం వంటి చిన్న పట్టణాల నుంచి వచ్చిన నాకు బెంగళూరు ఎంతో నేర్పింది. 2008లో నా బావ నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. నేను చూసిన మొదటి మెట్రో నగరం ఇదే. కోరమంగళలో నా మొదటి అడుగు పడింది. ఇప్పుడు అదే నగరంలో ఒక వ్యాపారవేత్తగా నిలబడటం గర్వంగా ఉంది" అని ధర్మ మహేష్ తెలిపారు.

జిస్మత్ ప్రత్యేకతలు:

ప్రీమియం క్వాలిటీ: హైజీనిక్ మరియు ఫ్రెష్ మీట్‌తో వంటకాలు సిద్ధం చేయడం.

ఆరోగ్యం - భద్రత: నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ కస్టమర్ల ఆరోగ్యంపై దృష్టి.

విస్తరణ: తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయి, ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు బ్రాండ్ విస్తరణ.

ఈ కార్యక్రమంలో ధర్మ మహేష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News