Viral Video : మైనస్ 35 డిగ్రీల చలిలో వింత ప్రయోగం..జుట్టు ఏమైందో చూస్తే షాక్ అవుతారు
మైనస్ 35 డిగ్రీల చలిలో వింత ప్రయోగం..జుట్టు ఏమైందో చూస్తే షాక్ అవుతారు
Viral Video : ప్రపంచంలో కొన్ని చోట్ల చలికాలం వచ్చిందంటే చాలు.. బయట అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోవాలి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయి జనజీవనం పూర్తిగా స్తంభించిపోతుంది. అయితే, ఈ గడ్డకట్టే చలిని కూడా కొందరు ఎంజాయ్ చేస్తూ రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఒక సూపర్ కోల్డ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మైనస్ 35 డిగ్రీల చలిలో ఇద్దరు యువతులు చేసిన సాహసం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
ఏమిటా వింత ప్రయోగం?
సాధారణంగా మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే రక్తం కూడా గడ్డకట్టేంత చలి. అలాంటి సమయంలో ఇద్దరు యువతులు తమ జుట్టుతో ఒక వింత ఎక్స్‌పెరిమెంట్ చేశారు. వారు ఇంటి నుంచి బయటకు వచ్చి, తమ జుట్టును నీటిలో తడిపారు. ఇంకేముంది.. కేవలం కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఆ నీరు గడ్డకట్టి పోవడంతో పాటు, వారి జుట్టు ఇనుప తీగల్లా నిటారుగా నిలబడిపోయింది. గాలికి ఊగడం కాదు కదా.. కనీసం వంచడానికి కూడా వీలు లేనంత కఠినంగా జుట్టు మారిపోవడంతో ఆ యువతులు కూడా ఆశ్చర్యపోయారు. తమ వింత రూపాన్ని చూసి వారే నవ్వుకుంటూ కెమెరాకు ఫోజులిచ్చారు.
సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్
ఈ వీడియోను రెయిన్‌మేకర్ 1973 అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కేవలం 18 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 10 లక్షలకు పైగా మంది వీక్షించగా, వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. మైనస్ 35 డిగ్రీల చలిలో ప్రాణాలతో ఉండటమే గొప్ప అని కొందరు అంటే, ప్రకృతి కంటే గొప్ప హెయిర్ స్టైలిస్ట్ మరొకరు ఉండరని మరికొందరు చమత్కరిస్తున్నారు.
A hair experiment done in super cold: -35°C pic.twitter.com/Q3vyo3AF5f
— Massimo (@Rainmaker1973) February 7, 2026
నెటిజన్ల స్పందన
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. "మ్యాగ్జిమమ్ హోల్డ్ ఇచ్చే హెయిర్ స్ప్రే కోసం వెతుకుతున్నారా? అయితే ఈ చలి ప్రదేశానికి వెళ్ళండి" అని ఒకరు జోక్ చేయగా.. "వారు వేడి నీటిని జుట్టుపై పోసుకోవడం వల్ల ఇలా త్వరగా గడ్డకట్టి ఉండవచ్చు" అని ఒక టెక్నికల్ రీజన్ వెతికారు. మరొక నెటిజన్ స్పందిస్తూ.. "దుబాయ్ లాంటి ఎండల్లో జుట్టు పాడవుతుందని బాధపడేవాడిని.. కానీ ఈ చలిలో జుట్టు పరిస్థితి చూస్తుంటే వింతగా ఉంది" అని రాసుకొచ్చారు. మొత్తానికి ఈ ఫ్రోజెన్ హెయిర్ ఎక్స్‌పెరిమెంట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌లో ఉంది.