Viral Video : వీడు మామూలోడు కాదు..పాముతోనే పరాచకాలా? వైరల్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

వీడు మామూలోడు కాదు..పాముతోనే పరాచకాలా? వైరల్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Update: 2026-02-08 04:18 GMT

Viral Video : సాధారణంగా పాము కనిపిస్తే చాలు.. ఎంతటి ధైర్యవంతుడైనా ఆమడదూరం పరుగెడతాడు. కానీ ఒక బుడతడు మాత్రం పామును చూసి అస్సలు భయపడలేదు సరే కదా, దాన్ని పట్టుకుని ఆట వస్తువులా ఆడుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఈ చిన్నారి సాహసం చూసి కొందరు "నిజమైన ఖత్రోన్ కా ఖిలాడీ" అంటుంటే, మరికొందరు మాత్రం "అయ్యో.. పిల్లాడికి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత?" అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @Khadiza_kbc అనే ఐడి ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది. ఒక పొలంలో నీళ్లు నిలిచి ఉండగా, అక్కడ ఒక పాము వెళ్తుంటుంది. ఆ పిల్లాడు ఎంతో ఉత్సాహంగా ఆ పాము వెనకాలే వెళ్లి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను ఎంతో నేర్పుగా ఆ పాము తోకను పట్టుకుని పైకి లేపుతాడు. ఆ పాము అతని వైపు తిరిగి కరిచేందుకు ప్రయత్నించినా, ఆ బుడతడు ఏమాత్రం భయపడకుండా దాన్ని గాలిలో అటూ ఇటూ ఊపుతూ ఆడుకుంటాడు.

ఈ 26 సెకన్ల వీడియో ఇప్పుడు వేలల్లో వ్యూస్ సంపాదించింది. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే పిల్లలకు ప్రకృతితో, జంతువులతో ఉన్న అనుబంధం ఎంత గొప్పదో ఈ వీడియో ద్వారా తెలుస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. "పట్టణాల్లో ఉండే పిల్లలు బల్లిని చూస్తేనే అరిచేస్తారు, కానీ పల్లెటూరి పిల్లలు పాములతోనే ఆటలాడుతున్నారు" అంటూ ఒక నెటిజన్ రాసుకొచ్చారు. ఆ చిన్నారి ముఖంలో భయం బదులు ఏదో కొత్త వస్తువును కనుగొన్నామన్న ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. పాము ఎన్నిసార్లు కాటు వేయాలని చూసినా, ఒక నిపుణుడిలా దాన్ని విదిలించడం చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఈ సాహసం ఎంత గొప్పగా అనిపించినా, ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాము విషపూరితమైనదా కాదా అనేది చిన్న పిల్లలకు తెలియదు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. నెటిజన్లు కూడా "పిల్లాడు చాలా ధైర్యవంతుడే కానీ, తల్లిదండ్రులు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు" అని సూచిస్తున్నారు. అడవి జంతువులతో, సరీసృపాలతో ఆడుకోవడం అనేది పరాక్రమం కాదు, అది ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ సాహస బుడతడు మాత్రం ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారాడు.

Tags:    

Similar News