ప్రియుడితో భార్యను సాగనంపిన భర్త.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్‌!

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లా భవానీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

Update: 2025-07-24 05:48 GMT

ప్రియుడితో భార్యను సాగనంపిన భర్త.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్‌!

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లా భవానీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నలుగురు పిల్లల తల్లి, 40 ఏళ్ల జానకీ దేవి తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన ప్రియుడి కోసం కుటుంబాన్ని వదిలేసింది. ఆశ్చర్యకరం ఏమిటంటే, ఆమెను స్వయంగా భర్తే ఆమె ప్రియుడితో వెళ్లిపోనివ్వడం గమనార్హం.

జానకీ 20 సంవత్సరాల క్రితం రామ్‌చరణ్ (47) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ ఖర్చులు మించిపోవడంతో రామ్‌చరణ్ ముంబైకి వెళ్లి టైల్స్ వేసే పనిలో చేరాడు. భర్త దూరంగా ఉండడాన్ని ఆసరాగా తీసుకుని జానకీ తన పొరుగువూరికి చెందిన 25 ఏళ్ల సోను ప్రజాపతితో స్నేహం పెంచుకుంది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరూ కోర్టు పెళ్లి చేసుకొని దాదాపు ఆరునెలల పాటు కలిసి నివసించారు. కానీ ఆ సంబంధం కోల్పోయిన తరువాత, జానకీ భర్త వద్దకు తిరిగి వచ్చి క్షమాపణలు చెప్పి తిరిగి కుటుంబంతో చేరింది.

కొంతకాలం సజావుగా గడిపిన ఆమె, మళ్లీ పాత ప్రియుడి వద్దకే వెళ్లిపోయింది. దీంతో బాధపడ్డ రామ్‌చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జులై 20న పోలీసుల సమక్షంలో ఇరుపక్షాల మధ్య పంచాయతీ జరిపారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ ఒక ప్రకటనలో తన భార్య ఇకపై సోనూతోనే ఉండబోతుందని, తనకు ఆమెతో ఇకపై ఎలాంటి సంబంధం లేదని రాసి, సంతకం చేశాడు. తన నలుగురు పిల్లలు తనతోనే ఉంటారని స్పష్టం చేశాడు. గతంలో ఆమె తప్పు గుర్తించి తిరిగొచ్చినా, ఇప్పుడు మళ్లీ అదే పని చేయడంతో ఇక జీవించలేనని పేర్కొన్నాడు.

ఇక జానకీ మాత్రం సోనూతో నాలుగేళ్ల నుంచి పరిచయం ఉందని, ఇప్పుడైనా అతనితోనే జీవించాలని నిర్ణయించుకుందని తెలిపింది. పిల్లలు తమ తండ్రితోనే ఉండాలని తాను అంగీకరిస్తున్నానని చెప్పింది. ఇద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నామని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని సమగ్రంగా పరిశీలించిన భవానీగంజ్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ హరియోమ్ కుష్వాహా, ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరిందని తెలిపారు.

Tags:    

Similar News