Tata Motors Offers: పండుగ ఆఫర్.. టాటా కార్లపై భారీ డిస్కౌంట్‌

Tata Motors Offers: పండుగ సీజన్ లో దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ త‌న‌ సేల్స్ పెంచుకునేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంది. ఈ క్ర‌మంలో తన కార్లపై మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది

Update: 2020-09-28 10:08 GMT

Tata Motors Offers: పండుగ సీజన్ లో దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ త‌న‌ సేల్స్ పెంచుకునేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంది. ఈ క్ర‌మంలో తన కార్లపై మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కార్ల పై భారీగా ధరలను త‌గ్గించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2020 వరకు అందుబాటులో ఉండ‌నున్న‌ది.

ముఖ్యంగా బీఎస్-6 ఇంజీన్ ఎస్‌యూవీ టాటా హ్యారియర్ కారుపై 80 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, కన్స్యూమర్ స్కీమ్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. బీఎస్6 కార్లకు మాత్రమే అందుబాటులో ఉంచిన సంస్థ నెక్సాన్, టైగోర్, టియాగో, హారియర్ పై డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో డిస్కౌంట్‌లను ప్రకటించలేదు. కస్టమర్లకు రూ.40 వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు కార్పొరేట్ డిస్కౌంట్‌గా రూ .15 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు. టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్ జెడ్ఏ ప్లస్ మోడల్ మినహా అన్ని మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తాయి.

కన్స్యూమర్ స్కీమ్ 15వేలు, 7 వేల వరకు కార్పొరేట్ తగ్గింపు, 10 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కలిపి మొత్తం ప్రయోజనం 32 వేలు. అయితే కార్పొరేట్ ఆఫర్ టాటా గ్రూప్ , టీఎంఎల్ ఉద్యోగులు, టాటా ట్రస్ట్ ఇండియా, టాటా గ్రూప్ ఎస్ఎస్ఎస్ రెఫరల్, టాప్ 10 , టాప్ 20 కార్పొరేట్స్ తోపాటు, కోవిడ్-19 యోధులకు, ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుంది.

బీఎస్- 6 టాటా నెక్సాన్: టా మోటార్స్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ మోడల్ పై 15 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఇచ్చింది. అయితే డీజిల్ వేరియంట్లో మాత్రమే, డీజిల్ డెరివేటివ్‌ను ఎంచుకునే వినియోగదారులకు 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ ఆఫర్లు ఉన్నప్పటికీ చాలా స్వల్పం.

Tags:    

Similar News