Samsung Galaxy Note 20: శాంసంగ్ గెలాక్సీ నోట్ 20పై డిస్కౌంట్!

Samsung Galaxy Note 20: శాంసంగ్ గెలాక్సీ నోట్ 20పై డిస్కౌంట్!
x
Highlights

Samsung Galaxy Note 20 | శాంసంగ్ డేస్ సేల్ లో భాగంగా గాలక్సీ నోట్ 20తో పాటు పలు స్మార్ట్ ఫోన్లపై ఆ సంస్థ డిస్కౌంట్ ప్రకటించింది.

Samsung Galaxy Note 20 | శాంసంగ్ డేస్ సేల్ లో భాగంగా గాలక్సీ నోట్ 20తో పాటు పలు స్మార్ట్ ఫోన్లపై ఆ సంస్థ డిస్కౌంట్ ప్రకటించింది. గాలక్సీ నోట్ 20పై రూ.9 వేల డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది శాంసంగ్.. హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకు కార్డుదారులకు అదనంగా మరో రూ. 6 వేల క్యాష్ బ్యాక్ అందిస్తున్నామంది. సెప్టెంబర్ 23 వరకు ఈ ఆఫర్ ఉంటుందని, ప్రముఖ అం లైన్ పోర్టల్స్ తో పాటు రీటైల్ స్టోర్లలో కుడా ఈ ఆఫర్ పొందవచ్చని తెలిపింది.

గెలాక్సీ నోట్ 20 లాంచింగ్ ధర 77,999 రూపాయలు. సేల్ ధర 68,999 రూపాయలు. ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో ఆరువేల తగ్గింపు. మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ను 62,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ బ్లూ రంగులలో ఇది లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫీచర్లు ఇవే..

1080x2400 పిక్సెల్స్ రిజట్యూషన్

♦ ఆండ్రాయిడ్ 10

♦ శాంసంగ్ ఎక్సినోస్ 990ప్రాసెసర్

♦ 6.70 అంగుళాల హెచ్‌డి ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ + ఫ్లాట్ డిస్‌ప్లే

♦ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్

♦ 12+64+12మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా

♦ 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

♦ 4300 ఎంఏహెచ్ బ్యాటరీ

Show Full Article
Print Article
Next Story
More Stories