Snakes Sleep: పాములు రోజుకు ఎన్ని గంటలు నిద్రిస్తాయో తెలుసా? షాకింగ్ నిజాలు!

Snakes Sleep: పాములు సాధారణంగా రోజుకు దాదాపు 16 గంటలు నిద్రపోతాయి.

Update: 2025-09-28 06:58 GMT

Snakes Sleep: పాములు రోజుకు ఎన్ని గంటలు నిద్రిస్తాయో తెలుసా? షాకింగ్ నిజాలు!

Snakes Sleep: మనుషులకు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతుంటారు. కానీ, కొన్నిసార్లు బద్ధకంతో కొంతమంది అంతకు మించి నిద్రపోతుంటారు. అయితే, నిద్ర విషయంలో మనుషుల కంటే బద్ధకించే జంతువులు చాలా ఉన్నాయి. ఆ జాబితాలో పాములు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో ఇవి మరింత గాఢ నిద్రలోకి జారుకుంటాయట.

రోజుకు 18 గంటల నిద్ర!

పాములు సాధారణంగా రోజుకు దాదాపు 16 గంటలు నిద్రపోతాయి. కానీ, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కనిపించే కొండచిలువ లాంటి కొన్ని జాతులు మాత్రం నిజమైన బద్ధకస్తులని చెప్పవచ్చు. ఈ పైథాన్ పాములు రోజుకు ఏకంగా 18 గంటల పాటు నిద్రపోతాయని పరిశోధనల్లో తేలింది. అంటే, కేవలం ఆరు గంటలు మాత్రమే అవి మేల్కొని ఉంటాయి. ఆ కొద్ది సమయంలోనే అవి ఆహారం కోసం వేటాడుతాయి.

చలికాలంలో మరింత నిద్ర

పాములు చల్లని వాతావరణంలో బయటకు రావడానికి ఇష్టపడవు. అందుకే శీతాకాలంలో అవి తమ నిద్ర సమయాన్ని మరింత పెంచుకుంటాయి. చలికాలంలో కొన్ని పాములు ఏకంగా 20 నుంచి 22 గంటల పాటు నిద్రపోతాయని నిపుణులు చెబుతున్నారు. కొండచిలువ అయితే ఒకసారి కడుపునిండా ఆహారం తీసుకుంటే రోజుల తరబడి పడుకుంటుంది.

పాములపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు

వేగం: కింగ్ కోబ్రా ప్రపంచంలో అత్యంత వేగంగా కదిలే పాముల్లో ఒకటి. దీని వేగం సెకనుకు 3.33 మీటర్లు ఉంటుందట.

ఆయుష్షు: కింగ్ కోబ్రా సుమారు 20 సంవత్సరాల వరకు జీవించగలదు.

విషం: ప్రపంచంలో గుర్తించిన 3,600 పాము జాతుల్లో కేవలం 600 జాతులకు మాత్రమే విషం ఉంటుంది. వీటిలో మనుషులకు ప్రమాదం కలిగించేవి దాదాపు 200 జాతులు మాత్రమే.

భారత్‌లో పాముకాటు: మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. వీరిలో 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Tags:    

Similar News