Viral Video: చెవి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. వైద్యులు పరీక్షించి చూడగా షాక్..!
చెవిలోకి చీమలు, చిన్న చిన్న కీటకాలు వెళ్లడం సర్వసాధారనం. రాత్రుళ్లు పడుకున్న సమయంలో చెవుల్లోకి వెళ్లిన కీటకాలు ఇబ్బంది పెడుతుంటాయి.
Viral Video: చెవి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. వైద్యులు పరీక్షించి చూడగా షాక్
Viral Video: చెవిలోకి చీమలు, చిన్న చిన్న కీటకాలు వెళ్లడం సర్వసాధారనం. రాత్రుళ్లు పడుకున్న సమయంలో చెవుల్లోకి వెళ్లిన కీటకాలు ఇబ్బంది పెడుతుంటాయి. తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంటాయి. అయితే ఓ మహిళ చెవిలోకి ఏకంగా ఒక పాము వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో, ఓ మహిళ చెవిలోకి చిన్న పాము దూరింది. ఈ వీడియోలో పాము పూర్తిగా ఆమె చెవిలోకి చేరిపోయిందని, బయటకు కేవలం పాము తోక మాత్రమే కనిపిస్తున్నదిగా స్పష్టంగా కనిపిస్తోంది. మహిళ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి.
ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్న వివరాలు తెలియరాలేకపోయినా, వీడియోలో డాక్టర్ ఒక ప్లక్కర్‌తో పాము తోకను పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేస్తుండటం కనిపిస్తోంది. పాము దూరిన సమయంలో మహిళ స్పృహలో ఉండటం ఆశ్చర్యం.
సాధారణంగా చెప్పుల్లో, ఇంటి సెల్ఫుల్లో పాములు దూరడాన్ని చూసి ఉంటాం. కానీ ఇలా చెవిలోకి పాములు వెళ్లడం బహుశా ఇదే తొలిసారి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.