Viral Video: ఫ్రిజ్‌లో ఊహించ‌ని అతిధి.. డోర్ తెరిసి చూడ‌గానే షాకింగ్ సీన్..!

Viral Video Snake Found Inside Fridge Shocking Summer Surprise Leaves Netizens Speechless
x

Viral Video: ఫ్రిజ్‌లో ఊహించ‌ని అతిధి.. డోర్ తెరిసి చూడ‌గానే షాకింగ్ సీన్..!

Highlights

Viral Video: సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కడొక్కడో దాగున్న పాములన్నీ బయటకు వస్తాయి. ఎండ వేడిని తట్టుకోలేక జనావాసాల్లోకి వస్తుంటాయి.

Viral Video: సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కడొక్కడో దాగున్న పాములన్నీ బయటకు వస్తాయి. ఎండ వేడిని తట్టుకోలేక జనావాసాల్లోకి వస్తుంటాయి. అయితే సోషల్ మీడియా పరిధి పెరిగిన తర్వాత పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇప్పటివరకు పాములు కార్లలో, ఇళ్లలో తలుపుల వెనుక, బూట్లలో లేదా బ్యాగుల్లో తలదాచుకోవడం చూసి ఉంటాం. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ వేసవిలో చల్లటి నీరు తాగాలనుకొని ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె గుండె ఆగినంత పని అయ్యింది.

డోర్ ఓపెన్ చేయగానే పెద్ద పాము బుసలు కొడుతూ కనిపించింది. ఒక్కసారిగా భయంతో వెనక్కి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిన ఆమె, అక్కడి నుంచే ఆ దృశ్యాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసింది. పాము ఎలా లోపలికి ప్రవేశించిందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఇకపై ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే" అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తే, “బయట చాలా వేడి ఉంది కాబట్టి కాస్త చల్లదనం కోసం ఫ్రిజ్‌లోకి వచ్చిందేమో” అంటూ మరికొందరు సరదాగా స్పందిస్తున్నారు.

అయితే ఇది సహజంగా జరిగిందా? లేక ఓ స్క్రిప్టెడ్ వీడియోనా? అన్నదానిపై కూడా చర్చ కొనసాగుతోంది. వ్యూస్ కోసం కావాలనే వీడియోను రూపొందించి ఉండొచనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories