Viral Video: వ్యక్తిపై పులి దాడి.. ఆ తర్వాత మంచం మీద...

Viral Video: సాధారణంగా పులి కనిపిస్తేనే గజగజ వణికిపోయే పరిస్థితి.. అలాంటిది ఒక పులి ఏకంగా గ్రామంలోకి చొరబడి, ఒక వ్యక్తిపై దాడి చేసి, ఆపై దర్జాగా ఇంటి ముందున్న మంచంపై పడుకుని సేదతీరిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో వెలుగుచూసింది.

Update: 2025-12-30 06:19 GMT

Viral Video: సాధారణంగా పులి కనిపిస్తేనే గజగజ వణికిపోయే పరిస్థితి.. అలాంటిది ఒక పులి ఏకంగా గ్రామంలోకి చొరబడి, ఒక వ్యక్తిపై దాడి చేసి, ఆపై దర్జాగా ఇంటి ముందున్న మంచంపై పడుకుని సేదతీరిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే?

బంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌ సమీపంలోని ఒక గ్రామంలోకి అర్ధరాత్రి సమయంలో ఒక పులి ప్రవేశించింది. ఇంటి బయట ఉన్న గోపాల్ కోల్ అనే వ్యక్తిపై ఆకస్మికంగా దాడి చేసి గాయపరిచింది. అయితే, ఆ తర్వాత అడవిలోకి వెళ్లకుండా, అదే ఇంటి ఆవరణలో ఉన్న మంచంపైకి ఎక్కి గంటల తరబడి విశ్రాంతి తీసుకుంది.

ఇళ్ల పైకప్పులపై గ్రామస్తులు

మంచంపై పులి తిష్ట వేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారంతా ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కి గంటల తరబడి గడిపారు. పులి మంచంపై పడుకుని ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 8 గంటల పాటు శ్రమించి, పులిని సురక్షితంగా బంధించి తిరిగి అడవిలో విడిచిపెట్టారు. పులి దాడిలో గాయపడిన గోపాల్ కోల్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉండటంతో తమ గ్రామంలోకి పులులు రావడం పరిపాటిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని, ప్రాణభయంతో బతకాల్సి వస్తోందని వారు మండిపడుతున్నారు.


Tags:    

Similar News