Optical Illusion: మీ కళ్లు ‘షార్ప్’ అని నమ్ముతున్నారా? అయితే 10 సెకన్లలో తప్పును పట్టుకోండి చూద్దాం!
ఈ రోజు.. మరొక సవాల్‌తో మీ ముందుకు వచ్చేశాను.. మీరు పజిల్స్ సాల్వ్ చేయడంలో దిట్టా.. అయితే పైన ఉన్న చిత్రంలో ఉన్న చిన్న తప్పును ఇట్టే పసిగట్టేయండి..
Optical Illusion: మీ కళ్లు ‘షార్ప్’ అని నమ్ముతున్నారా? అయితే 10 సెకన్లలో తప్పును పట్టుకోండి చూద్దాం!
ఈ రోజు.. మరొక సవాల్‌తో మీ ముందుకు వచ్చేశాను.. మీరు పజిల్స్ సాల్వ్ చేయడంలో దిట్టా.. అయితే పైన ఉన్న చిత్రంలో ఉన్న చిన్న తప్పును ఇట్టే పసిగట్టేయండి.. కేవలం 10 సెకన్లలో ఈ చిక్కుముడిని విప్పితే.. మీ పరిశీలనా శక్తి అమోఘంగా ఉందని అర్థం. మరీ ఈ చిక్కుముడిని ఇప్పడానికి మీరు సిద్ధమా.. అయితే పదండి మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయో లేదో టెస్ట్ చేద్దాం..
పజిల్ ఏంటంటే..
ఒక్కసారి పైన ఉన్న బోర్డును నిశితంగా పరిశీలించండి. అంతా గులాబీ మయం! ఎక్కడ చూసినా ఇంగ్లీష్ అక్షరాల్లో 'PINK' (పింక్) అని రాసి ఉంది. కానీ, ఆ రంగుల ప్రపంచంలో ఒకే ఒక్క చోట 'తప్పు' దొర్లింది. అన్నీ 'PINK'ల మధ్య ఒక పదం మాత్రం భిన్నంగా ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఈరోజు మీ టాస్క్.
సమయం ముఖ్యం బిగులు..
టైమ్ లిమిట్ లేని పజిల్ బోర్ కొడుతుంది కదా. అందుకే మీకోసం ఒక చిన్న ఛాలెంజ్.
సూపర్ ఫాస్ట్: 3 సెకన్లలో గుర్తిస్తే మీరు 'జీనియస్'.
షార్ప్ ఐస్: 10 సెకన్లలో గుర్తిస్తే మీ కంటి చూపు చాలా షార్ప్‌గా ఉందని అర్థం.
10 సెకన్ల కంటే ఎక్కువ సమయం పడితే.. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి.
మరి రెడీనా? మీ కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతోంది.. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎనిమిది.. తొమ్మిది.. పది. స్టాప్! మీ టైం అప్.
మీరు తప్పును గుర్తించారా..
మీరు ఇప్పటికే ఆ భిన్నమైన పదాన్ని కనిపెట్టి ఉంటే.. కంగ్రాట్స్. మీ ఏకాగ్రత, పరిశీలనా శక్తి అద్భుతంగా ఉంది. ఒకవేళ మీరు ఇంకా ఆ తప్పు గుర్తించకపోతే, ఒక చిన్న హింట్ ఇస్తున్న చూడండి. బోర్డులో కుడి వైపు లేదా మధ్య వరుసలను జాగ్రత్తగా చూడండి. అన్నీ 'PINK' అని ఉంటే, అక్కడ మాత్రం ఉదాహరణకు 'PINKY' లేదా 'PINT' వంటి మరో పదం ఉండవచ్చు.
సమాధానం ఇదే..
వెతికి వెతికి అలసిపోయిన వారి కోసం.. మేమే ఆ తప్పును గుర్తించి ఎరుపు రంగు సర్కిల్‌తో మార్క్ చేశాం చూడండి.