Viral Video: పెళ్లిలో అతిథులకు 'బంగారు బిస్కెట్లు' పంపిణీ.. అది నిజమైన బంగారమేనా? నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్!
Viral Video: సౌదీ అరేబియా పెళ్లిలో వధువు సోదరుడు వరుడి కుటుంబానికి 24 క్యారెట్ల బంగారు కడ్డీలు పంచాడా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వెనుక అసలు నిజమేంటి? అది బంగారమా లేక చాక్లెట్లా?
Viral Video: పెళ్లిలో అతిథులకు 'బంగారు బిస్కెట్లు' పంపిణీ.. అది నిజమైన బంగారమేనా? నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్!
Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఏదో ఒక విలాసవంతమైన వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే, తాజాగా సౌదీ అరేబియాలో జరిగిన ఒక పెళ్లికి సంబంధించిన 33 సెకన్ల క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దానికి కారణం.. అక్కడ అతిథులకు పంపిణీ చేసిన 'బంగారు కడ్డీలు'.
బ్రీఫ్‌కేస్ నిండా బంగారు బిస్కెట్లు! వైరల్ అవుతున్న వీడియోలో సాంప్రదాయ సౌదీ దుస్తులు (థోబ్‌లు) ధరించిన పురుషులు ఒక వరుసలో కూర్చుని ఉన్నారు. ఒక వ్యక్తి బ్రీఫ్‌కేస్ నిండా మెరిసిపోతున్న పసుపు రంగు కడ్డీలను పట్టుకుని ప్రతి ఒక్కరికీ పంచుతున్నాడు. వీడియో క్యాప్షన్ ప్రకారం.. వధువు సోదరుడు వరుడి కుటుంబ సభ్యులకు 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను బహుమతిగా ఇస్తున్నాడని పేర్కొన్నారు. కొందరు అతిథులు ఆ కడ్డీలను అందుకుని చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు.
నిజం ఏంటి? బంగారం లేక చాక్లెటా? ఈ వీడియో చూసిన నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు "సౌదీ సంపన్న దేశం, అక్కడ ఇది సాధ్యమే" అని వాదిస్తుంటే, మరికొందరు మాత్రం "అవి గోల్డ్ ఫాయిల్‌తో కప్పబడిన లగ్జరీ చాక్లెట్లు" అని కామెంట్ చేస్తున్నారు.
ట్విస్ట్: AI చాట్‌బాట్ గ్రోక్ (Grok) కూడా ఈ విషయంలో అయోమయానికి గురైంది. ఒకసారి అవి 'పాచి' కంపెనీకి చెందిన లగ్జరీ చాక్లెట్లు అని చెప్పగా, మరోసారి అవి 'నిజమైన బంగారు బిస్కెట్లు' అని బదులిచ్చింది.
స్థానికుల వాదన: అయితే సౌదీ అరేబియాకు చెందిన కొందరు వ్యక్తులు మాత్రం, సంపన్న వివాహాల్లో మైత్రికి గుర్తుగా నిజమైన బంగారాన్ని బహుకరించడం అక్కడ ఒక సంప్రదాయమని స్పష్టం చేస్తున్నారు.
సౌదీ సంస్కృతిలో వధువుకు ఇచ్చే 'మహర్' లేదా 'షబ్కా' రూపంలో బంగారం ఇవ్వడం సాధారణమే. కానీ ఇలా అతిథులందరికీ బిస్కెట్లు పంచడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి అది తియ్యని చాక్లెట్ అయినా, విలువైన బంగారమైనా.. ఆ రేంజ్ బహుమతులు చూసి నెటిజన్లు మాత్రం అవాక్కవుతున్నారు.