Kitchen Gadgets: అదిరిపోయే '3-ఇన్-1' మేకర్.. చిటికెలో బ్రేక్‌ఫాస్ట్ రెడీ! ధర ఎంతో చూసేయండి..

Kitchen Gadgets: ఉరుకుల పరుగుల జీవితం.. ఆఫీసుకో, కాలేజీకో వెళ్లే హడావిడి.. ఈ క్రమంలో చాలామంది అల్పాహారం చేయడానికి సమయం లేక ఇబ్బంది పడుతుంటారు.

Update: 2026-02-10 14:13 GMT

Kitchen Gadgets: అదిరిపోయే '3-ఇన్-1' మేకర్.. చిటికెలో బ్రేక్‌ఫాస్ట్ రెడీ! ధర ఎంతో చూసేయండి..

Kitchen Gadgets: ఉరుకుల పరుగుల జీవితం.. ఆఫీసుకో, కాలేజీకో వెళ్లే హడావిడి.. ఈ క్రమంలో చాలామంది అల్పాహారం చేయడానికి సమయం లేక ఇబ్బంది పడుతుంటారు. మరి మీ బ్రేక్‌ఫాస్ట్ మొత్తాన్ని ఒకే ఒక మేకర్ రెడీ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ప్రముఖ టెక్ బ్రాండ్ 'ఉబన్' (UBON)బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒక అద్భుతమైన గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే 'ఉబన్ 3-ఇన్-1 బ్రేక్‌ఫాస్ట్ మేకర్'. ఈ స్టోరీలో దాని ప్రత్యేకతలు, ధర గురించి తెలుసుకుందాం.

సాధారణంగా వంటగదిలో ఓవెన్, కాఫీ మేకర్, గ్రిల్ టోస్టర్ వేర్వేరుగా ఉంటాయి. కానీ ఉబన్ తెచ్చిన ఈ సరికొత్త పరికరం ఈ మూడింటి కలయికగా అందుబాటులోకి వస్తుంది. ఇది మీ వంటగదిలో స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా, తక్కువ సమయంలోనే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను రెడీ చేసి ఇస్తుంది.

మినీ ఓవెన్: పిజ్జా వంటివి వేడి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

కాఫీ మేకర్: ఒకేసారి 2 నుంచి 3 కప్పుల వేడివేడి కాఫీని సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు.

గ్రిల్ టోస్టర్ & ఫ్రైయింగ్ పాన్: ఆమ్లెట్లు వేసుకోవడానికి, కూరగాయలు గ్రిల్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రత్యేకతలు ఇవే :

ఈ పరికరం చూడటానికి కాంపాక్ట్‌గా ఉండటమే కాకుండా, అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది. ఈ పరికరం 1360 వాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. దీనివల్ల వంట వేగంగా పూర్తవుతుంది. ఇందులో సమయాన్ని, ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రత్యేకమైన నాబ్‌లు కూడా ఉన్నాయి. ఇది గ్రిల్లర్, ఫ్రైయింగ్ పాన్ నాన్-స్టిక్ కోటింగ్‌తో అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఆహారం రెడీ చేసే టైంలో అంటుకోదు,దీంతో శుభ్రం చేయడం కూడా సులభం అవుతుంది. ఇందులో కాఫీ మేకర్, ఓవెన్, గ్రిల్లర్‌ను విడివిడిగా లేదా ఒకేసారి ఉపయోగించుకునే సదుపాయం ఉంది.

గమనిక: ఓవెన్, గ్రిల్లర్ ఒకదానితో ఒకటి అనుసంధానించి ఉంటాయి. అంటే మీరు ఒకదాన్ని ఆన్ చేస్తే మరొకటి కూడా పనిచేయడం స్టార్ట్ అవుతుంది.

ధర విషయానికి వస్తే..

ఈ మల్టీ పర్పస్ బ్రేక్‌ఫాస్ట్ మేకర్ ధర రూ.7,599 గా నిర్ణయించారు. ఇది ఉబన్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది. మీరు కంపెనీ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేటప్పుడు 'UBON10' అనే కూపన్ కోడ్‌ను ఉపయోగిస్తే అదనంగా 10% తగ్గింపు పొందవచ్చని కంపెనీ తెలిపింది. బ్యాచిలర్లకు, ఉద్యోగులకు ఈ 3-ఇన్-1 బ్రేక్‌ఫాస్ట్ మేకర్ ఒక చక్కని వరం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ సమయంలో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునే వారు దీనిపై ఒక కన్నేయొచ్చు.

Tags:    

Similar News