Optical Illusion: నెటిజన్లకు చుక్కలు చూపిస్తున్న పజిల్.. 3 సెకన్లలో కనిపెట్టే వారు నిజంగా జీనియస్సే!
కళ్లకు పరీక్ష పెడుతూ.. మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూజన్ (Optical Illusion) చిత్రాలు నెట్టింట చేసే హడావుడి అంతా ఇంతా కాదు.
Optical Illusion: నెటిజన్లకు చుక్కలు చూపిస్తున్న పజిల్.. 3 సెకన్లలో కనిపెట్టే వారు నిజంగా జీనియస్సే!
కళ్లకు పరీక్ష పెడుతూ.. మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూజన్ (Optical Illusion) చిత్రాలు నెట్టింట చేసే హడావుడి అంతా ఇంతా కాదు. తాజాగా ఒక ఆసక్తికరమైన బ్రెయిన్ టీజర్ నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. అసలు కథేంటంటే.. ఒక చిన్నారి స్కూలుకు వెళ్లడానికి రెడీ అవుతుంది. ఆల్రెడీ స్కూలుకు లేయిట్ అయ్యింది. వెళ్లేముందు తన జుట్టును ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్ కోసం ఆ చిన్నారి తన రూమ్‌లో వెతుకుతుంది. కానీ, తన గది అంతా చిందరవందరగా ఉండటంతో అది ఎక్కడుందో పాపం తనకు దొరకడం లేదు. ఆ గజిబిజి గదిలో హెయిర్ డ్రైయర్ ఎక్కడ ఉందో కనిపెట్టి ఆ పాపకు సాయం చేసే బాధ్యత ఇప్పుడు మీదే!
షరతులు వర్తిస్తాయి బాస్..
ఏ పజిల్‌కు అయినా సమయ పరిమితి లేకపోతే కిక్కేముంటుంది? అందుకే మీకు ఆ పాపకు సహాయం చేయడానికి ఇచ్చే సమయం కేవలం 10 సెకన్లు మాత్రమే. నిజానికి షార్ప్‌నెస్, అద్భుతమైన పరిశీలనా శక్తి ఉన్నవారు మాత్రమే దీనిని ఇచ్చిన టైంలోపు గుర్తించగలరని అనుకుంటున్నా.. మరి మీకు అంత షార్ప్‌నెస్, అద్భుతమైన పరిశీలనా శక్తి ఉందో లేదో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు నిజంగా జీనియస్ అయితే.. కేవలం 3 సెకన్లలోనే దీనిని పట్టేయగలరు. నాదీ గ్యాంరెంటీ.
కౌంట్‌డౌన్ స్టార్ట్ చేద్దామా:
ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎనిమిది.. తొమ్మిది.. పది! స్టాప్. టైం అప్. మీకు ఆ హెయిర్ డ్రైయర్ ఇంకా దొరకలేదా.. మరేం పర్వాలేదు. మరోసారి ఆ చిత్రాన్ని బాగా పరిశీలించండి. గదిలో ఉన్న వస్తువులను ఒక సారి మంచిగా గమనించండి. సాధారణంగా హెయిర్ డ్రైయర్ ఏ ఆకారంలో ఉంటుంది? ఎక్కడ పడేసే అవకాశం ఉంది? అని ఆలోచిస్తే సమాధానం మీ కళ్ల ముందే ఉంటుంది. హింట్ ఇస్తే ఇక అందులో మజా ఉండదు కదా.
సమాధానం ఇదే..
మీరు ఇప్పటికే గుర్తించి ఉంటే.. మీరు నిజంగా గ్రేట్. మీ పరిశీలనా శక్తి అమోఘం. ఒకవేళ ఎంత వెతికినా దొరకని వారి కోసం.. కింద ఉన్న ఇమేజ్‌లో ఎరుపు రంగు సర్కిల్‌ను గమనించండి. అక్కడే హెయిర్ డ్రైయర్ దాగి ఉంది.
గమనిక: ఇటువంటి పజిల్స్ కేవలం సరదా కోసం మాత్రమే కాదు, మీ ఏకాగ్రతను (Concentration) పెంచడానికి కూడా ఇవి విశేషంగా సహాయపడుతాయి. మీకు ఈ పజిల్ నచ్చితే, మీ స్నేహితులకు కూడా ఈ లింక్ షేర్ చేసి, వారు ఎన్ని సెకన్లలో ఆ హెయిర్ డ్రైయర్ కనిపెడతారో ఛాలెంజ్ చేయండి.