Viral Video: ఓవైపు ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా సబ్బుల పెట్టెలు ఎత్తుకెళ్లిన జనం..!

Viral Video: మంచిర్యాల జిల్లాలో ఈ రోజు ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

Update: 2025-06-26 08:20 GMT

Viral Video: ఓవైపు ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా సబ్బుల పెట్టెలు ఎత్తుకెళ్లిన జనం..!

Viral Video: మంచిర్యాల జిల్లాలో ఈ రోజు ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. లక్సెట్టిపేట నుంచి రాయచూర్‌కు సబ్బుల లోడుతో వెళ్తున్న లారీ, ఇటిక్యాల సమీపంలో ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు.

అయితే, గాయపడినవారికి సాయం చేయాల్సిన స్థానికులు మాత్రం మానవత్వాన్ని మరిచి, లారీలోని సబ్బుల లోడును దోచుకోవడంలో నిమగ్నమయ్యారు. క్లీనర్ ప్రాణాలతో ఉండగానే అతని ఆర్తనాదాలు అక్కడి వారిని కదిలించలేకపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికి, అప్పటికే సగానికి పైగా సబ్బుల లోడును జనాలు తీసుకెళ్లారు. పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, డ్రైవర్ మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఒక ప్రాణం కళ్ల ముందే పోతుంటే, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే, కనికరం లేకుండా సొంత లాభం కోసం లారీలోని సొమ్ము దోచుకెళ్లిన తీరు స్థానికులను, నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


Tags:    

Similar News