Thar SUV: కొత్త కారు కొన్న సంతోషం కాసేపు కూడా లేదు.. లక్షల కారు.. క్షణాల్లోనే నుజ్జునుజ్జు!
Thar SUV: ఒక కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీని పూజ చేస్తుండగా అనుకోకుండా మొదటి అంతస్తు నుండి కిందపడి ధ్వంసం అయ్యింది.
Thar SUV: కొత్త కారు కొన్న సంతోషం కాసేపు కూడా లేదు.. లక్షల కారు.. క్షణాల్లోనే నుజ్జునుజ్జు!
Thar SUV: ఒక కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీని పూజ చేస్తుండగా అనుకోకుండా మొదటి అంతస్తు నుండి కిందపడి ధ్వంసం అయ్యింది. ఈ సంఘటన ఢిల్లీలోని నిర్మాణ్ విహార్‌లో జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గాజియాబాద్‌కు చెందిన మాని పవార్ అనే మహిళ రూ. 27 లక్షల విలువైన మహీంద్రా థార్‌ను కొనుగోలు చేసింది. సోమవారం రోజు షోరూమ్‌కు వెళ్లి కారును డెలివరీ తీసుకుంది. కొత్త కారుకు బయలుదేరే ముందు పూజ చేయాలనుకుంది. షోరూమ్ మొదటి అంతస్తులో నిమ్మకాయలను తొక్కించే సమయంలో ఆమె అనుకోకుండా యాక్సిలరేటర్ నొక్కింది. దీంతో కారు ఒక్కసారిగా అద్దాలను పగలగొట్టుకుని మొదటి అంతస్తు నుండి కింద పేవ్‌మెంట్‌పైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో మాని పవార్, ఆమె భర్త ప్రదీప్ నిర్మన్‌తో పాటు షోరూమ్ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే, కారులోని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.