Viral Video: 93 ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం.. రూ. 20కే ఇచ్చిన షాపు ఓనర్.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..!

Viral Video: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లపై యువతలో ఆసక్తి తగ్గిపోతోంది. చిన్న చిన్న కారణాలకే విడాకులు, పరస్పర వేధింపులు, హత్యలు జరుగుతున్న ఘటనలు చూస్తూ చాలా మంది పెళ్లంటేనే భయపడుతున్నారు.

Update: 2025-06-19 05:30 GMT

Viral Video: 93 ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం.. రూ. 20కే ఇచ్చిన షాపు ఓనర్.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..!

Viral Video: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లపై యువతలో ఆసక్తి తగ్గిపోతోంది. చిన్న చిన్న కారణాలకే విడాకులు, పరస్పర వేధింపులు, హత్యలు జరుగుతున్న ఘటనలు చూస్తూ చాలా మంది పెళ్లంటేనే భయపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ "సింగిల్‌గానే హ్యాపీ లైఫ్" అంటూ పోస్టులు, రీల్స్ పేలిపోతున్నాయి.

అయితే, ఇవన్నీ చూసిన తర్వాత కూడా నిజమైన ప్రేమ, జీవితాంతం తోడుంటానన్న బంధం అంటే ఏమిటో గుర్తు చేసే ఓ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఛత్రపతి సంభాజీ నగర్‌లో 93 ఏళ్ల నివృత్తి షిండే అనే వృద్ధుడు తన భార్య శాంతాబాయితో కలిసి ఓ బంగారం షాపుకి వచ్చాడు. తెల్లటి ధోతి, కుర్తా, టోపీ ధరించిన ఆయన — తన భార్య కోసం మంగళసూత్రం కొనాలని కోరాడు.

తన దగ్గర ₹1120 మాత్రమే ఉన్నదని చెప్పిన షిండే గారు, "ఇప్పుడు ఆషాఢ మాసం ఏకాదశి సమీపిస్తుంది. పండరి పురం యాత్రకి బయల్దేరుతాం. ఈ సందర్భంగా నా భార్యకి మంగళసూత్రం కొనాలనుంది" అని షాపు సిబ్బందితో అనగానే, వారి మధ్య ఉన్న ఆ అనురాగాన్ని చూసి షాపు యజమాని ఫిదా అయిపోయాడు.

కేవలం ₹20 మాత్రమే తీసుకుని, బంగారు మంగళసూత్రాన్ని ఆ దంపతుల చేతికి కానుకగా ఇచ్చాడు. "మీలాంటి పెద్దవాళ్ల ఆశీర్వాదం మాకూ కావాలి" అంటూ ప్రేమగా అందించాడు. దంపతులు ఇద్దరూ ఆ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ, ఈ రోజుల్లో కూడా ఇలాంటి ప్రేమబంధాలు ఉన్నాయన్న నమ్మకాన్ని అందించింది.


Tags:    

Similar News