Viral News: పాముతో పరాచికాలు.. ఒక్క దెబ్బకు పోయిన ప్రాణాలు
Viral News: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునా జిల్లా రాఘౌగఢ్‌కు చెందిన దీపక్ మహావర్ (42) పాములు పట్టడంలో దిట్ట అని గుర్తింపు పొందిన వ్యక్తి. అయితే ఇదే నైపుణ్యం చివరికి ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది.
Viral News: పాముతో పరాచికాలు.. ఒక్క దెబ్బకు పోయిన ప్రాణాలు
Viral News: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునా జిల్లా రాఘౌగఢ్‌కు చెందిన దీపక్ మహావర్ (42) పాములు పట్టడంలో దిట్ట అని గుర్తింపు పొందిన వ్యక్తి. అయితే ఇదే నైపుణ్యం చివరికి ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. బర్‌బట్‌పురా గ్రామంలో పాము కనిపించిందన్న సమాచారం అందిన వెంటనే దీపక్ అక్కడికి వెళ్లి, అత్యంత విషపూరితమైన నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు.
పామును మెడకు చుట్టుకొని బైక్‌పై అక్కడినుంచి బయలుదేరాడు. మార్గ మధ్యలో ఆగి, వీడియోల కోసం పాముతో పోజులిచ్చే ప్రయత్నం చేశాడు. అనవసరంగా పామును చేత్తో తట్టుతూ ప్రవర్తించడంతో, అది ఒక్కసారిగా అతని చేతిపై కాటు వేసింది. దీంతో వెంటనే గునా జిల్లా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు.
అయితే అర్ధరాత్రి దాటాక దీపక్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో ఊపిరితిత్తులు పనిచేయకపోయి మృత్యువాత పడ్డాడు. పాములపై జ్ఞానం ఉన్నా, అవినీతిగా ప్రవర్తించటం వల్ల జరిగిన ఈ ఘటన పట్ల స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పాములు ఎంత విషపూరితంగా ఉన్నాయో తెలుసుకున్నవారైనా జాగ్రత్త తప్పక పాటించాల్సిన అవసరముందని పలువురు హెచ్చరిస్తున్నారు.