Viral Video: ప్రశాంతంగా ఉన్న వీధులోకి సింహం వచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగింది? వైరల్ వీడియో
Viral Video: పాకిస్తాన్‌కు చెందిన మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీధలో అంతా అప్పటివరకు ప్రశాంతంగా ఉంది.
Viral Video: ప్రశాంతంగా ఉన్న వీధులోకి సింహం వచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగింది? వైరల్ వీడియో
Viral Video: పాకిస్తాన్‌కు చెందిన మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీధలో అంతా అప్పటివరకు ప్రశాంతంగా ఉంది. రాత్రి కావడంతో కొద్దిమంది జనం అటు ఇటూ తిరుగుతున్నారు. ఒక్కసారిగా సింహం రోడ్డుపైకి వచ్చింది. కనబడిన వారినల్లా.. పదండి ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఒక సింహం అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. అలాగే ఎదురుగా వచ్చిన వారిపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి తెగ కామెంట్లు పెడుతున్నారు.
ఒక జూ నుంచి తప్పించుకున్న సింహం జనవాసాల్లోకి ఒక్కసారిగా ప్రవేశించింది. లాహోర్‌లోని జోహర్ టౌన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఒక పెంపుడు జంతువు. ఒక ఫామ్ హౌస్‌లో దీన్ని సంరక్షణ చూస్తున్నారు. అయితే ఈ సింహం అక్కడ నుంచి గోడ దూకి పారిపోయింది. ఇలా సింహం గోడ దూకిన వెంటనే జనవాసాలు తిరిగే రోడ్డు మీదకు వచ్చింది. అప్పటికి ఆ వీధి చాలా ప్రశాంతంగా ఉంది. రాత్రి సమయం కావడంతో తక్కువమంది తిరుగుతున్నారు.
అయితే ఎప్పుడైతే సింహం రోడ్డుపైకి దూకిందో అప్పుడు ఆ సమయంలో ఎదురుగా వస్తోన్న మహిళపై సింహం దాడి చేసింది. ఆ తర్వాత కొంతమంది చిన్నపిల్లలపై కూడా సింహం దాడికి దిగింది. దీంతో వీళ్లందరికీ గాయాలయ్యాయి. వీరిని ఆ తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దాన్ని ఎవరైనా పట్టుకున్నారా? అంటూ కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ వీడియోలో సింహం వెనకాలే ఒక వ్యక్తి పరుగు పెడుతూ ఉంటాడు. అతను ఈ సింహం తాలూకు వ్యక్తే అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉంటారు.