Chicken: కోడి అవసరమే లేకుండా చికెన్‌ కర్రీ చేయవచ్చు.. ఏంటి.. నమ్మడంలేదా? అయితే ఈ కథ ఫ్యాక్ట్ చదివేయండి!

Chicken: ఇవి శరీరంలోని రక్తనాళాల్లా పనిచేస్తాయి. ఈ ఫైబర్స్ ద్వారా ఆక్సిజన్, నీరు, పోషకాలు అందిస్తూ మాంసం పక్కా రియల్ చికెన్ మాదిరిగా పెరిగేలా చేశారు.

Update: 2025-04-20 04:30 GMT

Chicken: కోడి అవసరమే లేకుండా చికెన్‌ కర్రీ చేయవచ్చు.. ఏంటి.. నమ్మడంలేదా? అయితే ఈ కథ ఫ్యాక్ట్ చదివేయండి!

Chicken: మీ అందరికి ఓ ప్రశ్న.. చికెన్ కర్రీ చేయడానికి ముందుగా ఏం కావాలి? ఇంకేం కావాలి.. ఇదేం ప్రశ్న అని మనసులో అనుకుంటున్నారా? ఏముంది.. చికెన్‌ కర్రీ చేయడానికి ముందుగా కావాల్సింది కోడి మాంసమే కదా అని థింక్‌ చేస్తున్నారా? అయితే ఇక్కడే మీరు చికెన్‌ బిర్యానీలో కాలేశారు. ఇకపై కోడి లేకుండానే చికెన్ తయారు చేసుకోవచ్చట..! ఏంటీ.. అర్థంకాలేదా? నమ్మడంలేదా? అయితే నేను చెప్పేది క్లియర్‌గా వినండి. కోడిని ముట్టుకోకుండా చికెన్‌ సంబంధిత ఐటెమ్స్‌ ఎలా చేస్తున్నారో మీకు బ్రీఫ్‌గా చెప్తా!

మరి అసలు ఇది ఎలా సాధ్యమైంది అని మీకు ఇప్పుడు డౌట్‌ వస్తోంది కదా. జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేశారు. వారు ఏం చేశారు అంటే, అసలైన కోడి నుంచి మాంసం సంబంధించిన కొన్ని సెల్స్‌ తీసుకున్నారు. ఆ సెల్స్‌ను ఒక ప్రత్యేకమైన ల్యాబ్‌ సెటప్‌లో పెంచుతూ, ముద్దగా గాని లేక పేస్టుగా కాకుండా, అసలైన మాంసంలా ఉండేలా తయారు చేశారు. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే, మన శరీరంలో మాంసానికి ఆహారం, ఆక్సిజన్ అందించేది రక్తనాళాలే. అటువంటి రక్తనాళాలు లేకుండా బయట ఉన్న ల్యాబ్‌లో మాంసాన్ని పెంచడం అంటే చాలా కష్టం.

ఈ కష్టాన్ని అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఒక బ్రిలియంట్ ఐడియాతో ముందుకు వచ్చారు. మన శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలానే మాంసానికి పోషకాలు అందించేందుకు వారు 'హాలో ఫైబర్ బయోరియాక్టర్‌' అనే ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని ఉపయోగించారు. ఈ యంత్రం లోపల చాలా సూక్ష్మమైన పైపులాంటి ఫైబర్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తనాళాల్లా పనిచేస్తాయి. ఈ ఫైబర్స్ ద్వారా ఆక్సిజన్, నీరు, పోషకాలు అందిస్తూ మాంసం పక్కా రియల్ చికెన్ మాదిరిగా పెరిగేలా చేశారు.

మొదట్లో వాళ్లు చిన్న స్కేల్‌లోనే ప్రయోగం మొదలుపెట్టారు. కేవలం 50 ఫైబర్స్‌తో చిన్న మాంసపు ముద్దలా తయారుచేశారు. తర్వాత దాన్ని అభివృద్ధి చేసి ఒకేసారి 1125 ఫైబర్స్‌ను ఉపయోగించి దాదాపు 10 గ్రాముల చికెన్ ముక్క తయారు చేశారు. అది సైజ్ పరంగా చూస్తే మనం బయట తినే నగ్గెట్‌ మాదిరిగానే ఉంటుంది. రెండు సెం.మీ పొడవు, ఒక సెం.మీ మందంతో చక్కగా ముక్కలా కనిపిస్తుంది.

ఇప్పటికే ఈ ల్యాబ్‌ చికెన్‌పై జరిగిన రసాయన పరీక్షల్లో ఇది అసలైన చికెన్‌ మాంసంలా ఉందని తేలింది. కానీ ఇది ఇప్పటికీ తినే స్టేజ్‌కు రాలేదు. ఎందుకంటే ఇది తయారైన యంత్రం, గెల్, పోషక పదార్థాలన్నీ ఫుడ్ గ్రేడ్ కావు. అంటే మనం తినేందుకు అనుమతించిన పదార్థాలు కావు. అందుకే ఇంతవరకు ఎవరూ దీన్ని టచ్ చేయలేదు. ఇంకొన్నేళ్లలో ఇవి రెగ్యులర్‌గా రెస్టారెంట్స్‌కి.. సూపర్ మార్కెట్లకి వచ్చేస్తాయా? ఎప్పుడు మన ప్లేట్లో ఇవి కనిపిస్తాయా అన్న ఉత్కంఠే ఇప్పుడు అందరిలోనూ ఉంది.

Tags:    

Similar News