ఈ దేశాలలో వారానికి 4 రోజులు మాత్రమే పని.. మిగతా రోజులు విశ్రాంతి..

Four Days Work: ప్రపంచంలో చాలా దేశాలలో ఉద్యోగులు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేస్తారు. మిగతా 3 రోజులు సెలవు దినాలు.

Update: 2021-12-28 08:00 GMT

ఈ దేశాలలో వారానికి 4 రోజులు మాత్రమే పని.. మిగతా రోజులు విశ్రాంతి..

Four Days Work: ప్రపంచంలో చాలా దేశాలలో ఉద్యోగులు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేస్తారు. మిగతా 3 రోజులు సెలవు దినాలు. ఇప్పుడు ఇండియాలో కొత్త సంవత్సరం నుంచి కొత్త లేబర్‌ చట్టాలు అమలుచేసే అవకాశం ఉంది. వారంలో 5 రోజుల కంటే తక్కువ పని చేసే దేశాలు కూడా ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఈ జాబితాలో జపాన్‌ మొదటి స్థానంలో ఉంది.

జూన్ 2021లో జపాన్ ప్రభుత్వం దేశంలోని కంపెనీలను వారానికి 4 రోజులు మాత్రమే పని చేయమని ఉద్యోగులను కోరింది. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి, పని, జీవితానికి మధ్య సమతుల్యతను సాధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో న్యూజిలాండ్ ఎప్పుడో చేరిపోయింది. గత సంవత్సరం ఈ దేశ ప్రధాన మంత్రి జషిందా ఆర్డెన్ దేశంలోని కంపెనీలు, యజమానులను వారానికి 4 రోజులు పని చేసే ఎంపిక గురించి ఆలోచించాలని కోరారు.

దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుందని పర్యాటక రంగం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఎక్కువ సెలవులు పొందడం ద్వారా ప్రజలు తమకోసం కొంత సమయాన్ని కేటాయించుకుంటారని తెలిపారు. ఇది పని వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించడం సులభం చేస్తుంది. నిరుద్యోగిత రేటు 3.3 శాతం ఉన్న ఏకైక దేశం నెదర్లాండ్స్. ప్రపంచం మొత్తం మీద వారంలో అతి తక్కువ పని చేసే దేశం ఇదే.

ఉద్యోగులు వారానికి 29 గంటలు మాత్రమే పని చేస్తారు. మహిళలు మరింత వెసులుబాటు పొందుతారు వారానికి 25 గంటలు మాత్రమే పని చేస్తారు. నెదర్లాండ్స్‌లోని పురుష కార్మికులు వారానికి గరిష్టంగా 34 గంటలు మాత్రమే పని చేయాలి. ఇక్కడ పని గంటల నియమాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. భారతదేశంలో ఈ నిబంధనపై కసరత్తు జరుగుతోంది.

ఇందుకోసం ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌ని రూపొందించింది. దీని అమలు తర్వాత భారతదేశంలో కూడా వారానికి 4 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు వారంలో 4 రోజులు పని చేసి 3 రోజులు విశ్రాంతి తీసుకోవాలంటే 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tags:    

Similar News