Viral Video: కూతురి కోసం తండ్రి సాహసం.. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి..!

Viral Video: తన కన్నబిడ్డను రక్షించేందుకు ఓ తండ్రి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సముద్రంలోకి దూకిన సంఘటన అమెరికాలో ఆదివారం చోటు చేసుకుంది.

Update: 2025-07-01 07:54 GMT

Viral Video: కూతురి కోసం తండ్రి సాహసం.. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి..!

Viral Video: తన కన్నబిడ్డను రక్షించేందుకు ఓ తండ్రి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సముద్రంలోకి దూకిన సంఘటన అమెరికాలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల నుంచి అపారమైన ప్రశంసలు అందుకుంటోంది.

డిస్నీ డ్రీమ్ అనే ఓ షిప్ బహమాస్‌ నుంచి సౌత్ ఫ్లోరిడా వైపు ప్రయాణిస్తుండగా, ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ ఓడ నుంచి సముద్రంలోకి జారిపోయింది. అతనికొడుకు ఇది గమనించిన ఆమె తండ్రి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకాడు. మునిగిపోతున్న తన కూతురిని అందుకుని పైకి తెచ్చాడు.

ఈ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు అరుస్తూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కెప్టెన్ వెంటనే ఓడను ఆపి సహాయక బృందాన్ని పంపించారు. అటుపై బోటులో తండ్రీకూతురు ఉన్నచోటుకు వెళ్లి వారిని సురక్షితంగా ఓడ వద్దకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు, ఇద్దరూ చిన్నచిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. తండ్రి చేసిన సాహసానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

“తండ్రి ప్రేమ అంటే ఇదే.. ప్రాణాలకు తెగించి పిల్లాడిని కాపాడిన రియల్ హీరో” అంటూ కామెంట్లు పెడుతున్నారు. “అదృష్టం బాగుంది.. అక్కడ షార్క్‌లు, తిమింగళాలు లేకపోవడం గొప్ప విషయమే” అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.


Tags:    

Similar News