Yoga: రోజు అరగంట సేపు ఈ యోగా చేస్తే అంతులేని శక్తి మీ సొంతం..!

Yoga: రోజూ యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. యోగాలో చాలా రకాలు ఉంటాయి.

Update: 2022-02-21 01:30 GMT

Yoga: రోజు అరగంట సేపు ఈ యోగా చేస్తే అంతులేని శక్తి మీ సొంతం..!

Yoga: రోజూ యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. యోగాలో చాలా రకాలు ఉంటాయి. ఇవి వివిధ మార్గాల్లో శరీరాన్ని బలోపేతం చేస్తూ వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. యోగాలో ఒక పద్ధతి ఉంటుంది. ఇది మీ మనస్సును మెరుగుపరచడమే కాకుండా శరీరం యొక్క శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ అరగంట పాటు ఈ యోగాను చేస్తే దాని ప్రయోజనాలను స్వయంగా అనుభవిస్తారు. ఈ యోగా పేరు హఠాయోగ. అంటే ఆసనాలు, ప్రాణయామం, ధ్యానం కలయిక అని చెప్పవచ్చు. కేవలం అరగంట పాటు చేయడం వల్ల మెదడు వ్యవస్థ పనితీరు, శక్తి స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి.

రెగ్యులర్ హఠా యోగా చేయడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచవచ్చు. సహజమైన ఆలోచనా ప్రక్రియలకు తోడ్పడుతుంది. మంచి ఆలోచనలకు నాంది అని ఒక సర్వేలో వెల్లడైంది. హఠా యోగా అనేది పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా సాధన చేస్తారు. దీనిలో ధ్యానం, శారీరక ఆసనాలు, శ్వాస ప్రక్రియలు కలిసి ఉంటాయి. మంచి ధ్యానం శరీరం ఆలోచనలు, భావాలు, అనుభూతులపై దృష్టి పెడుతుంది. మంచి ధ్యానం, హఠా యోగా రెండూ శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ప్రజలు రోజువారీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో వాటిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. యోగా వల్ల బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది. ఆలోచన శక్తి విపరీతంగా పెరుగుతుంది. మతిమరుపు తొలగిపోయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ప్రతిరోజు యోగా చేయాలి. మందులతో క్యూర్‌ కాని రోగాలు కూడా ఒక్కోసారి యోగా వల్ల తగ్గుముఖం పడుతాయి. మంచి రిలీఫ్‌ దొరుకుతుంది. అందుకే సనాతన ఆయుర్వేదంలో కూడా యోగా గురించి ప్రస్తావన ఉంది.

Tags:    

Similar News