Viral Video: మొసలికి చుక్కలు చూపించిన కుక్క.. పారిపోతుండగా ఎలా పట్టుకుందో చూడండి..!

Dog Attacks Crocodile: కుక్కల విశ్వాసం గురించి అందరికీ తెలిసిందే. అయితే, అత్యవసర సమయాల్లో కేవలం యజమానులే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా రక్షించే ధైర్యాన్ని అవి ప్రదర్శిస్తుంటాయి.

Update: 2025-05-14 06:13 GMT

Viral Video: మొసలికి చుక్కలు చూపించిన కుక్క.. పారిపోతుండగా ఎలా పట్టుకుందో చూడండి..!

Dog Attacks Crocodile: కుక్కల విశ్వాసం గురించి అందరికీ తెలిసిందే. అయితే, అత్యవసర సమయాల్లో కేవలం యజమానులే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా రక్షించే ధైర్యాన్ని అవి ప్రదర్శిస్తుంటాయి. తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ వీడియో ఒకటి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

జనావాసంలోకి మొసలి, ఆపై కుక్క ధైర్యం

ఓ జనావాస ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద మొసలి ప్రవేశించింది. ప్రజలు భయంతో పరుగులు తీయగా, ఓ వ్యక్తి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అది అక్కడి నుంచి పారిపోతుండగా, ఊహించని విధంగా ఒక కుక్క మొసలిపై దాడి చేసింది.

మొసలిని పట్టుకుని కుక్క పోరాటం

పరుగెత్తుకుంటూ వచ్చిన కుక్క, మొసలి మెడను పట్టుకుని దానిపై దాడికి దిగింది. వెంటనే అక్కడున్న వ్యక్తి ఇనుప కడ్డీలతో మొసలిని బంధించాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, కుక్క ధైర్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన

ఈ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. 7 మిలియన్లకు పైగా వ్యూస్‌, 7900కి పైగా లైక్స్ పొందింది. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క పవర్ మామూలుగా లేదుగా’’ అని ఒకరు, ‘‘అది మొసలి అనుకున్నావా.. లేక బల్లి అనుకున్నావా’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News