Indian Railway: 'HO కోటా' అంటే ఏమిటి తెలుసా? వెయిటింగ్ టికెట్ కూడా ఒకరోజు ముందే కన్ఫర్మ్..!

HO Quota In Train: భారతీయ రైల్వేలలో టికెట్ బుకింగ్ కోసం వివిధ కోటాలు అమలులో ఉన్నాయి. వీటిలో మీరు మీ అర్హతను బట్టి టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. సీటు బుకింగ్‌లో ప్రత్యేక కోటా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి ప్రత్యేకమైనదే HO కోటా.

Update: 2023-05-24 15:00 GMT

Indian Railway: 'HO కోటా' అంటే ఏమిటి తెలుసా? వెయిటింగ్ టికెట్ కూడా ఒకరోజు ముందే కన్ఫర్మ్..!

Indian Railway: మీరు రైలులో చాలాసార్లు ప్రయాణించే ఉంటారు. ఇందుకోసం ముందుగా ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. భారతీయ రైల్వేలలో టికెట్ బుకింగ్ కోసం వివిధ కోటాలు అమలులో ఉన్నాయి. వీటిలో మీరు మీ అర్హతను బట్టి టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. సీటు బుకింగ్‌లో ప్రత్యేక కోటా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి ప్రత్యేకమైనదే HO కోటా. ఈ కోటాలో అత్యంత విశేషమేమిటంటే, మీరు ఇందులో వెయిటింగ్ టికెట్ పొందుతున్నట్లయితే, ఆ సీటు కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఆశ్చర్యపోకండి.. మేం చెప్నేందంతా నిజమే. అసలేంటి ఈ హెచ్‌ఓ కోటా, దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు ఎవరు ఈ కోటా కింద బుక్ చేసుకోవచ్చు. ఈ కోటాను టికెట్ బుక్ చేసుకునే సమయంలో మాత్రమే ఉపయోగించవచ్చా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయా.. వీటిన్నంటికీ సమాధానాలు తెలుసుకుందాం.. ఇది కాకుండా, ఈ కోటాలో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు కూడా ఎలా కన్ఫర్మ్ అవుతాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం..

HO కోటా అంటే ఏమిటి?

HO కోటా అంటే హెడ్ క్వార్టర్స్ లేదా హై అఫీషియల్ కోటా. టికెట్ బుకింగ్ సమయంలో ఈ కోటా ఉపయోగించకూడదు. ముందుగా జనరల్ క్లాస్‌లో టిక్కెట్లు తీసుకోవాలి. అందులో కన్ఫర్మ్ సీటు వస్తే ఇక ఇబ్బంది లేదు. కానీ, వెయిటింగ్ టికెట్ అందుబాటులో ఉంటే.. హెడ్ క్వార్టర్‌ని సంప్రదించడం ద్వారా, ఆ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీంతో సీటు దొరుకుతుంది.

ఈ వ్యక్తులకు ప్రయోజనం..

రైల్వే అధికారుల ప్రకారం, ఈ HO కోటా VIP వ్యక్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వ్యక్తుల కోసం అందిస్తుంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, రైల్వే అధికారులు, త్రివిధ దళాల అధికారులు సహా పలువురు ఇందులో ఉంటారు. కొన్ని పరిస్థితులలో, సాధారణ ప్రజలు కూడా ఈ కోటాను ఉపయోగించుకోవచ్చు. వారి దరఖాస్తు ఆమోదిస్తే, వారికి కూడా కన్ఫర్మ్ సీటు లభిస్తుంది.

టిక్కెట్లు ఒక రోజు ముందే కన్ఫర్మ్ అవుతాయి..

ఈ కోటా కోసం దరఖాస్తు చేసుకున్న వారు, వారి వెయిటింగ్ టికెట్ ఫైనల్ చార్ట్ సిద్ధం చేయడానికి ఒక రోజు ముందు నిర్ధారించబడతాయి. రైల్వేలు ప్రతి రైలులో ఈ కోటా కోసం కొన్ని సీట్లను ఉంచుతాయి. వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. VIP కదలికలు ఎక్కువగా ఉన్న రూట్‌లో, ఈ కోటా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

సామాన్యులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు..

ఈ కోటా ప్రయోజనాన్ని పొందడానికి, సామాన్య ప్రజలు ప్రయాణ తేదీ నుంయి ఒక రోజు ముందు రైల్వే రిజర్వేషన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ ఏదైన ఎమర్జెన్సీ కారణంగా వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. మీరు మీ కారణానికి మద్దతుగా అవసరమైన పత్రాలను చీఫ్ రిజర్వేషన్ అధికారికి ఇవ్వాలి. వారు దీనితో సంతృప్తి చెందితే, మీకు పూరించడానికి ఒక ఫారమ్ ఇస్తారు.

ఫారం పూరిస్తే.. టిక్కెట్ కన్ఫర్మ్..

ఈ ఫారమ్‌ను పూరించిన తర్వాత, దానిని గెజిటెడ్ అధికారి ధృవీకరించాల్సి ఉంటుంది. దీని తర్వాత రిజర్వేషన్ కేంద్రంలో ఫారమ్‌ను సమర్పించాలి. అక్కడి నుంచి ఆ ఫారాన్ని రైల్వే జోనల్ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ నుంచి ఆ ఫారమ్ ఆమోదిస్తే, ఆ వ్యక్తి సీటు లభించినట్లే.

Tags:    

Similar News