Nuclear Radiation: అణు బాంబు పడ్డా.. ఈ చిన్న జీవికి మాత్రం ఏం కాదు..!

Nuclear Radiation: అణు యుద్ధం (Nuclear War) అనే మాట వినగానే ప్రపంచం అంతా వణికిపోతుంది.

Update: 2025-05-13 11:01 GMT

Nuclear Radiation: అణు బాంబు పడ్డా.. ఈ చిన్న జీవికి మాత్రం ఏం కాదు..!

Nuclear Radiation: అణు యుద్ధం (Nuclear War) అనే మాట వినగానే ప్రపంచం అంతా వణికిపోతుంది. అణ్వాయుధాల ప్రభావం (Nuclear Radiation Effect) అనేది మానవజాతి నుంచీ, ప్రకృతి వరకు అన్నింటినీ గల్లంతు చేసే శక్తితో ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా, అలాంటి ముప్పు నుంచి కూడా తట్టుకుని బతికే జీవులు (Radiation Resistant Creatures) ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

హిరోషిమా, నాగసాకీ (Hiroshima, Nagasaki) పై అణుబాంబు దాడుల తర్వాత దాదాపు ఆ ప్రాంతాల్లో జీవం అనేదే కనపడలేదు. కానీ అక్కడ బొద్దింకలు (Cockroaches) మాత్రం బతికి ఉండటం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది. దీంతో వాటిపై ప్రత్యేక పరిశోధనలు జరిపి, బొద్దింకల రేడియేషన్ రిసిస్టెన్స్ (Radiation Resistance in Cockroaches) వెనకున్న కారణాలు వెలికితీశారు.

బొద్దింకలు మానవాళికి ముందే ఈ భూమ్మీద 100 రెట్లు ఎక్కువ కాలంగా జీవిస్తున్నాయి. వాటి శరీర నిర్మాణం (Cockroach Body Structure) అనేక ప్రతికూల పరిస్థితులకు తట్టుకునేలా అభివృద్ధి అయింది. వాటి శరీరంపై ఉన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటూ జీవించగలవు.

అంతే కాదు — బొద్దింక తల తెగిపోయిన తర్వాత కూడా వారాల పాటు జీవించగలదు. వాటిలో కణవిభజన (Cell Division) చాలా తక్కువగా జరుగుతుండటంతో రేడియేషన్ ప్రభావం ఎక్కువగా పడదు. అలాగే, వాటి శరీర నిర్మాణం చాలా సరళమైనది కావడం, ఎప్పటికప్పుడు పునరుత్పత్తి అవసరం లేకపోవడం వల్ల రేడియేషన్‌ను తట్టుకునే సామర్థ్యం కలుగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4,000 రకాల బొద్దింకల జాతులు (Types of Cockroaches Worldwide) ఉన్నాయి. అయితే, వాటిలో కేవలం 30 రకాల బొద్దింకలే మనుషుల నివాస ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి ఆహారం కోసం తిరుగుతాయి. పగటి పూట భూమి పొరల్లో దాక్కుని బతికిపోతాయి.

బొద్దింకలు టైఫాయిడ్ (Typhoid), సాల్మొనెల్లా (Salmonella), ట్యూబర్క్యులోసిస్ (Tuberculosis) వంటి వ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల వీటి నివారణ (Cockroach Control) చాలా ముఖ్యం. ఇలా పలు రకాల కారణాల వల్ల బొద్దింకలు అణు రేడియేషన్ ను కూడా తట్టుకుని బతకగలవని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News