Viral Video: దొంగకు షాకింగ్ అనుభవం.. రైల్లో మహిళ చైన్ లాగేయడంతో..!

Viral Video: రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

Update: 2025-06-20 10:32 GMT

Viral Video: రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణికులు కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా… దొంగలు తమ పని తాము చేసి వెళ్లిపోతుంటారు. ముఖ్యంగా ఫోన్లు, మెడలో చైన్లు, వాలెట్లు లాంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటూ చోరీలు జరిపే ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ యువకుడు రైలులో డోర్ పక్కన నిలబడి కనిపిస్తాడు. అదే సమయంలో మహిళలు బాత్‌రూం వెళ్లి వస్తుంటారు. అక్కడ నిలబడిన ఆ వ్యక్తి వారిని గమనిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఓ మహిళ బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చిందో లేదో… ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్‌ను ఒక్కసారిగా లాక్కుంటాడు.

ఆకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురైన మహిళ… తన చైన్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించింది. అయితే దొంగ మాత్రం బలంగా లాగడంతో చైన్ ఊడిపోతుంది. వెంటనే ఆ యువకుడు రైలు దిగిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆ హడావుడిలో అదుపుతప్పి డబ్బా పక్కనే బోర్లాపడిపోతాడు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. రైలు ప్రయాణాల్లో ఇలా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.


Tags:    

Similar News