Fact: చనిపోయిన పాము కూడా ప్రమాదకరమని తెలుసా.?
పాము అనే మాట వినగానే భయం వేయడం సర్వసాధారణమైన విషయం.
Fact: చనిపోయిన పాము కూడా ప్రమాదకరమని తెలుసా.?
Fact: పాము అనే మాట వినగానే భయం వేయడం సర్వసాధారణమైన విషయం. వేసవిలో ఎక్కడెక్కడో దాగున్న పాములన్నీ బయటకు వస్తుంటాయి. పాము కాటుకు గురై ప్రతీ ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. అయితే పామలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిలో ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా పాము చనిపోతే దాంతో ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తుంటాం. అయితే నిపుణులు మాత్రం దీనికి భిన్నమైన వాదన చెబుతున్నారు. పాముల్లో విషం వాటి తల భాగంలో ఉండే విష గ్రంధుల్లో నిల్వ ఉంటుంది. పాము చనిపోయిన తర్వాత కూడా వాటి దంతాల వద్ద మిగిలిన విషం కొన్ని గంటలపాటు క్రియాశీలంగా ఉండే అవకాశం ఉంది.
అయితే, ఎవరైనా పొరపాటున చనిపోయిన పాము దంతాలపై కాలు పెట్టినా లేదా తాకినా, ఆ విషం చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. అందుకే చనిపోయిన పాముల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
పాము కాటుతో శరీరంపై రెండు గాఢమైన దంతాల ముద్రలు కనిపిస్తే, అది విషపూరితమైన పామే అయి ఉంటుందని భావించాలి. అయితే మూడు లేదా అంతకంటే ఎక్కువ గాట్ల గుర్తులు ఉంటే, అది సాధారణ పాము అయి ఉండవచ్చు కానీ ఖచ్చిత నిర్ధారణకు వైద్య పరీక్షలు అవసరం.