Vastu Tips: వాస్తు ప్రకారం నిద్రలేచిన వెంటనే ఈ మూడు పనులు అస్సలు చేయవద్దు..!

Vastu Tips: వాస్తు సంబంధిత దోషాలు ఉన్న గృహాలలో ఎల్లప్పుడూ ప్రతికూల శక్తులు నివసిస్తాయి.

Update: 2022-11-26 01:30 GMT

Vastu Tips: వాస్తు ప్రకారం నిద్రలేచిన వెంటనే ఈ మూడు పనులు అస్సలు చేయవద్దు..!

Vastu Tips: వాస్తు సంబంధిత దోషాలు ఉన్న గృహాలలో ఎల్లప్పుడూ ప్రతికూల శక్తులు నివసిస్తాయి. ఇందులో దిశలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి దిశకి ఒక దేవుడు ఆధిపత్యం వహిస్తాడు. ఇంటిలో వాస్తు సంబంధిత దోషం ఉన్నట్లయితే ఆ ఇంట్లోని వ్యక్తి అనేక మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జీవితంలో పాజిటివ్, నెగటివ్‌ శక్తులు ఒక వ్యక్తి జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. మానవ జీవితంలో పాజిటివ్‌ శక్తుల ప్రభావం కారణంగా మనస్సు సంతోషంగా ఉంటుంది. నెగిటివ్‌ అనేక ఇతర సమస్యలను తెస్తుంది. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం తెల్లవారుజామున మూడు పనులు చేయడం నిషేధం. వాటి గురించి తెలుసుకుందాం.

ఉదయం అద్దంలో చూసుకోవడం

వాస్తు నియమాల ప్రకారం ఉదయాన్నే నిద్రలేచి ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. దీనివల్ల జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఈ కారణంగా పడకగదిలో అద్దం ఉండదు. ఎందుకంటే ఉదయం నిద్రలేచిన వెంటనే అందరు అద్దం వైపు దృష్టి పెడతారు. ఉదయాన్నే అద్దం చూసుకోవడం వాస్తులో నిషిద్ధం.

ఉదయం నీడను చూడటం

వాస్తు ప్రకారం ఒక వ్యక్తి నీడ తెల్లవారుజామున కనిపించకూడదు. ఉదయం నీడను చూడటం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ వ్యక్తి లోపలికి ప్రవేశిస్తుంది. ఉదయం పూట సొంత నీడను చూడటం వాస్తులో నిషేధం. నీడను చూసినప్పుడు వ్యక్తి మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది. నెగిటివ్‌ శక్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో తెల్లవారుజామున ఏ వన్యప్రాణుల చిత్రాలు కనిపించకూడదు. మీ ఇంటి గోడలపై ఏదైనా అడవి జంతువు ఫోటో ఉంటే వెంటనే దాన్ని తొలగించండి.

రాత్రిపూట తిన్న పాత్రలు

రాత్రిపూట తిన్న భోజన పాత్రలు కడగకపోవడం చాలా ఇళ్లలో తరచుగా కనిపిస్తుంది. వాస్తు ప్రకారం ఇలా తిన్న పాత్రలు ఉంచడం అశుభం. ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచి ఇలాంటి పాత్రలను చూస్తే వెంటనే నెగిటివ్‌ శక్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. అంతేకాదు రాత్రిపూట వంటగదిలో తిన్న పాత్రలు ఉంచడం వల్ల దారిద్ర్యం సంభవిస్తుందని నమ్మకం. ఒక వ్యక్తి తెల్లవారుజామున తిన్న పాత్రలని చూడటం వల్ల వ్యక్తి మనస్సుపై చెడు ప్రభావం పడుతుంది. దీని కారణంగా రోజు పనిలో ఆటంకాలు ఏర్పడతాయి.

Tags:    

Similar News